English | Telugu
పేపర్ లో వచ్చిన కళ్యాణ్ రాసిన కవిత.. వడ్డీ డబ్బుల కోసం కనకం ఫ్యామిలీ కష్టాలు!
Updated : Aug 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -162 లో.. కనకం, కృష్ణమూర్తిల కుటుంబానికి ఎలాగైనా రెండు రోజుల్లో వడ్డీ చెల్లించాలని సేట్ వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. రెండు రోజుల్లో డబ్బులు ఎలా సర్దుబాటు అవుతాయని కనకం కృష్ణమూర్తి ఇద్దరు టెన్షన్ పడతారు.
మరొకవైపు దుగ్గిరాల ఇంట్లో అందరూ హాల్లో కూర్చొని కాఫీ తాగుతుంటారు. అప్పుడే ఏదో ఒక కొరియర్ వస్తుంది. మళ్ళీ ఏం ఆర్డర్ చేసావని స్వప్నని అడుగుతాడు రాహుల్. నేనేం చేయలేదని స్వప్న అంటుంది.. నువ్వు వెళ్లి తీసుకో అని కళ్యాణ్ కి చెప్తుంది కావ్య. కళ్యాణ్ కొరియర్ తీసుకొని వచ్చి వదిన ఇది మీకే వచ్చిందని కావ్యకి చెప్తాడు. నాకు వచ్చింది కానీ అది మీకు సంబంధించినది ఓపెన్ చేసి చుడండని కావ్య అనగానే ఓపెన్ చేసి చూసేసరికి.. కళ్యాణ్ రాసిన కవిత మ్యాగజైన్ లో వస్తుంది. అది చూసి కళ్యాణ్ ఎమోషనల్ అవుతాడు. ఏమైందని ఇంట్లో అందరూ కళ్యాణ్ ని అడుగుతారు. నా కవితని ఇంట్లో ఎవరు గుర్తించలేదు.
ఇప్పుడు వదిన నా కవితని గుర్తించి పేపర్లో ప్రింట్ చేయించిందని కళ్యాణ్ అందరికి చెప్పగానే.. అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ పేపర్ లో వచ్చిన కళ్యాణ్ కవితని చూస్తారు. అందరూ కళ్యాణ్ కి కంగ్రాట్స్ చెప్తారు. నా కొడుకు ఇంత వరకు ఇంత సంతోషంగా ఎప్పుడు లేడని ధాన్యలక్ష్మి అంటుంది. నా కవిత ఇప్పుడు ఎంత మంది చూస్తారో అని కళ్యాణ్ అనుకుంటాడు. మరొకవైపు ఒక అమ్మాయి పేపర్ లో వచ్చిన కళ్యాణ్ కవిత చదువుతూ కళ్యాణ్ గురించి ఆలోచిస్తుంటుంది. కళ్యాణ్ కోసం అప్పు వెయిట్ చేస్తుంటుంది. కళ్యాణ్ హ్యాపీగా పేపర్ లో వచ్చిన తన కవితని తీసుకొని అప్పు దగ్గరికి వచ్చి చూపిస్తాడు. కానీ అప్పు మాత్రం పెద్దగా పట్టించుకోదు. అప్పుడే ఒక అమ్మాయి వచ్చి.. సర్ మీ కవిత సూపర్.. ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా అని కళ్యాణ్ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుంటుంది.
మరొకవైపు కావ్య దగ్గరకిరాజ్ వచ్చి.. మా కళ్యాణ్ కవిత పేపర్ లో ప్రింట్ వేయించావ్ అందుకు థాంక్స్ అని రాజ్ చెప్పగానే.. కావ్య షాక్ అవుతుంది. రేపు నువ్వు నాతో ఆఫీస్ కి రావాలి. ఎందుకంటే మిడిల్ క్లాస్ డిజైన్స్ రిక్వెర్ మెంట్ కోసం ఒక కంపెనీ వాళ్ళు మన ఆఫీస్ కి వస్తున్నారు. నీకైతే మిడిల్ క్లాస్ రిక్వైర్ మెంట్స్ గురించి బాగా తెలుస్తాయి కదా.. రేపు ఉదయం వెళ్ళాలని రాజ్ చెప్పగానే.. కొద్దీసేపు రాజ్ ని సరదాగా ఆటపట్టించిన కావ్య వస్తానని చెప్తుంది. మరొకవైపు కనకం, కృష్ణమూర్తి ఇద్దరు సేట్ కి ఇవ్వాల్సిన డబ్బుల గురించి బాధపడుతుంటే అప్పు వింటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.