English | Telugu

కళ్యాణ్ కవితలని ఆరాధిస్తున్న  రహస్య అభిమాని ఎవరు?

బ్రహ్మముడి సీరియల్ సోమవారం నుండి శనివారం వరకు రాత్రి 7:30 గంటలకు స్టార్ మా టీవీలో ప్రసారమవుతుంది. ఈ సీరియల్ లో రోజు రోజుకి కథలో ట్విస్ట్ లతో ఆసక్తికరంగా సాగుతుంది. అందుకే ఈ సీరియల్ కి తెలుగు రాష్ట్రాలలోనే కాదు అంతటా ఆదరణ ఎక్కువగా ఉంది. కారణం ఈ సీరియల్ లో ప్రతీ మధ్యతరగతి కుటుంబాన్ని ప్రతిబింబించేలా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబం యొక్క అవసరాలు, వాటి కోసం వారు చేసే అప్పులు, వాటిని తట్టుకోలేక వారు సర్దుకుపోయేతత్వాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని కలిపి కనకం-కృష్ణమూర్తిల కుటుంబాన్ని చూపిస్తున్నారు.

మరొకవైపు ‌ధనవంతులు సమాజం ఎలా ఉంటారు.. వారి అటిట్యూడ్ ఎలా ఉంటుంది.. వారు మధ్యతరగతి వాళ్ళని ఎలా చూస్తారనేది దుగ్గిరాల కుటుంబాన్ని ప్రతిబింబించేలా చూపిస్తూ ఈ సీరియల్ ముందుకు సాగుతుంది. కనకం-కృష్ణమూర్తిలకు ముగ్గురు కూతుళ్ళు.. ఒకరు స్వప్న, మరొకరు కావ్య, ఇంకొకరు అప్పు.. కనకం వీళ్ళందరిని బాగా డబ్బున్నవాళ్ళకి ఇచ్చి పెళ్ళి చేసి.. మేం పడే కష్టాలు మా పిల్లలు పడకూడదని ఆశపడుతుంటుంది.

అలాగే పెద్ద కూతురు స్వప్న తన తల్లి బాటలోనే ఉండాలనుకుంటుంది. చేసుకుంటే బాగా డబ్బున్న వాడినే చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది. కృష్ణమూర్తి మాత్రం నీతిగా, నిజాయితీగా బ్రతకాలని.. ఉన్నంతంలో హుందాగా బ్రతకాలని వాళ్ళ కూతుళ్ళకి భార్య కనకంకి చెప్తుంటాడు. చివరి అమ్మాయి అప్పు మాత్రం చదువుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేస్తూ తన ఖర్చులకు తను డబ్బులు సమకూర్చుకుంటూ ఎవరికీ భారంగా ఉండాలనుకుంటుంది. అయితే తాజాగా జరుగుతున్న సీరియల్ ఎపిసోడ్ లలో కథ పూర్తిగా మలుపు తిరిగింది.

కళ్యాణ్ రాసిన కవిత పేపర్ లో వస్తుంది. అది చూసి అందరూ సంతోషిస్తారు. తన కవితని చూసి కంటతడి పెట్టుకుంటాడు కళ్యాణ్. అయితే మరొకవైపు ఒక అమ్మాయి కళ్యాణ్ కవితని చదువుతుంటుంది. తన కవితకి ఫిధా అయినట్టుగా ఫీల్ అవుతుంటుంది ఆ అమ్మాయి. అయితే ఆ అమ్మాయి కళ్యాణ్ కి ఏమవుతుంది. ఇప్పటికే ఈ కథలో అప్పు కోసం కళ్యాణ్ ట్రై చేస్తున్నాడు. మరి కళ్యాణ్ కోసం.. అతని కవితలని ఇష్టంగా చదివే ఆ అమ్మాయి కొత్తగా వస్తుంది. మరి ఈ కొత్త క్యారెక్టర్ ఎవరనే ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. మరి ఆ రహస్య అభిమాని ఎవరు? కళ్యాణ్ స్నేహితురాలా లేక రహస్య ప్రేమికురాలా అనే సస్పెన్స్ తో 'బ్రహ్మముడి' మరింత ఆసక్తిగా సాగుతుంది.