English | Telugu

చచ్చేముందు కొన్ని రోజులైన ఎంజాయ్ చేయాలన్న గీతు రాయల్!

గీతు రాయల్.. ఇప్పుడు అందరికి సుపరిచితమే.. బిగ్ బాస్ సీజన్-6 అని అనగానే అందరికి గీతు రాయలే గుర్తుకొస్తుంది. గీతు రాయల్ బిగ్ బాస్ లోకి వెళ్ళిన తర్వాత తనని చిత్తూరు చిరుత అని నాగార్జున ముద్దుగా పిలిచేవాడు. గీతు తన మార్క్ స్ట్రాటజీస్ తో గేమ్ ప్లాన్ తో తోటి కంటెస్టెంట్స్ ని ఆడుకునేది. మైండ్ గేమ్ తో టాస్క్ లు ఫినిష్ చేస్తూ అందరిచేత గుడ్ కంటెస్టెంట్ అని అనిపించుకుంది.

బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు తన స్వార్థం తను చూసుకున్న గీతు రాయల్.. ఆదిరెడ్డి ఒక్కడితో మాత్రం క్లోజ్ గా ఉండేది. ఆది ఆది అంటూ ఎప్పుడు తనతోనే తిరిగేది. వాళ్ళిద్దరు యూట్యూబ్ లో రివ్యూలు ఇస్తుంటారు. అందుకేనేమో ఇద్దరు ఇట్టే కలిసిపోయారు. అయితే తన బిహేవియర్ అందరికీ నచ్చేది కాదు. దాంతో ఎలిమినేట్ అయింది. అయితే బిగ్ బాస్ హౌజ్ ని విడిచి వెళ్ళనని ఏడ్చిన గీతు రాయల్ ని ఓదార్చి బయటకు పంపించేసాడు నాగార్జున. అయితే గీతు ఎంత హౌజ్ లో తన స్వార్థం చూసుకున్నా ఎలిమినేట్ అయినప్పుడు చాలా మంది ఫ్యాన్స్ సపోర్ట్ గా నిలిచారు.

ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లతో పాటు కొత్తగా థ్రెడ్స్ ఆప్ వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే అందులో గీతు రాయల్ తన అభిప్రాయాన్ని ఒక పోస్ట్ లో చెప్పింది. " లైఫ్ లో మనం అనుకున్నది, అనుకోనిది జరుగుతుంటుంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఇప్పటికిప్పుడు మనం పోతే, నరకం పోయే దారిలో.. ఇన్ని రోజులు మనం బ్రతికి ఏం పీకాం అనే ప్రశ్న మన మైండ్ లోకి వచ్చినప్పుడు.. చెప్పుకోడానికి ఒకటి, రెండైనా ఉండాలి కదా, ఒకవేళ ఇప్పటివరకు ఏం పీకకపోయిన, పోయేముందు కొన్ని రోజులన్నా ఎంజాయ్ చేసి చచ్చిపోయామనే తృప్తి ఉండాలి కదా" అని గీతు రాయల్ ఈ పోస్ట్ లో రాసుకొచ్చింది.