English | Telugu
ఢీ షోకి ఆ పేరు..ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు ర్యాంకులు ఎలా వస్తున్నాయంటే ?
Updated : Aug 1, 2023
ఎక్స్ట్రా జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమోలో రాంప్రసాద్ కామెడీ చూస్తే మైండ్ బ్లాంక్ ఐపోతుంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో రాంప్రసాద్, మహేష్, శ్రీవిద్య కలిసి ఒక స్కిట్ చేశారు. మహేష్ ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ఇంటికి వెళ్తూ రాంప్రసాద్ కోడిని చంపేస్తాడు. దాంతో రాంప్రసాద్ మహేష్ దగ్గరకు వెళ్లి "ఇక్కడ నా కోడికి ఆఖరి రోజైతే నువ్వు అక్కడ ఫస్ట్ నైట్ చేసుకుంటున్నావా"..అని అనేసరికి "బోడి కోడే కదా" అని శ్రీవిద్య లైట్ తీసుకుంటూ ఒక కామెంట్ చేసింది. దానికి రాంప్రసాద్ కోడి గురించి చెప్పిన నెరేషన్ వింటే పొట్ట చెక్కలవ్వాల్సిందే. "ప్రపంచంలో ఐఏఎస్, ఐపిఎస్ ఆఫీసర్లకు ర్యాంకులు రావడానికి కారణం ఎవరో తెలుసా కోడే..అది తెల్లవారు జామునే లేచి కూస్తుంది కదా అప్పుడు అందరూ లేచి చదువుకుంటున్నారు కాబట్టి..
ఈ రోజు ఢీ సీజన్ 16 సీజన్లు కావడానికి కారణం కోడే.. కోడిలో ఉన్న ఢీ ని తీసుకెళ్లి వాళ్ళ షోకి పెట్టుకున్నారు" అని చెప్పేసరికి శ్రీవిద్య ఎక్స్ప్రెషన్ మాములుగా ఇవ్వలేదు. తర్వాత ఇమ్మానుయేల్ కాలేజీ డేస్ లో తాను ఒక అమ్మాయిని లవ్ చేసానని..కానీ విధి ఇద్దరినీ విడదీసింది అందుకే బాధగా బతికేస్తున్నానంటూ చెప్పి ఫీలయ్యాడు. ఇక వాళ్ళ ఇంటి దగ్గర దుస్తులు ఆరబెడుతున్న వర్షని చూసి షాకయ్యాడు. ఇక వర్ష కూడా ఇమ్ముని చూసి షాకయ్యింది. "ఇమ్ము నేను నీకు గుర్తున్నానా..నేను చేసినవి గుర్తున్నాయా" అని అడిగింది. "నాతో చేసినవి, వేరే వాళ్ళతో చేసినవి కూడా గుర్తున్నాయి" అంటూ కౌంటర్ వేశారు ఇమ్ము. రాకింగ్ రాకేష్ జూ పార్కుని చూసుకునే రోల్ లో నటిస్తూ చిన్నపిల్లలతో చేసిన స్కిట్ కూడా హైలైట్ గా నిలిచింది. ఇలా కొంతకాలం నుంచి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ లో మంచి మంచి స్కిట్స్ పడుతుండే సరికి ఆడియన్స్ కూడా హ్యాపీగా ఫీలవుతున్నారు...