English | Telugu
భవానీతో ముకుంద నిజం చెప్పనీయకుండా చేసిన మధు!
Updated : Aug 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -223 లో.. పన్నెండు రోజుల్లో వెళ్ళిపోతానని మురారీతో కృష్ణ చెప్పి.. తనకి కొంత డబ్బు ఇస్తుంది. వాటిని తన జ్ఞాపకంగా దాచుకోమని చెప్తుంది. అయితే వాటిని కృష్ణకే తిరిగి ఇచ్చి.. నా జ్ఞాపకంగా నువ్వు దాచుకో అంటాడు. అది విని కృష్ణ.. నువ్వు నా దేవుడని అంటుంది. మురారి అలానే చూస్తుండిపోతాడు.
మరుసటిరోజు ఉదయం కృష్ణ, మురారి ఇద్దరు వేరు వేరుగా ఒకరు బెడ్ పైన, ఒకరు కింద ఆ పడుకుంటారు. అయితే అప్పుడే భవాని వాళ్ళ గది దగ్గరికి వచ్చి డోర్ కొట్టగా.. నిద్రమత్తులో ఉన్న మురారి డోర్ ఓపెన్ చేస్తాడు. భవానిని చూసి షాక్ అవుతాడు. కృష్ణ బెడ్ మీద కాకుండా కింద పడుకోవడం గమనిస్తుంది భవాని. ఏంటి పెద్దమ్మ మీరు ఈ టైమ్ లో అని మురారి అడుగుతాడు. వెంటనే కృష్ణ లేచి.. పెద్ద అత్తయ్య అని అంటుంది. మీ మధ్య ఏదో సమస్య ఉందని తెలుస్తుందని భవాని అనగానే.. లేదు మేం బాగానే ఉన్నామని కృష్ణ, మురారి అంటారు. మీరు మన ఫామ్ హౌజ్ లో ఎన్ని రోజులు ఉన్నారని భవాని అడుగగా.. రెండు రోజులు ఉన్నామని కృష్ణ అనగా, మూడు రోజులని మురారి అంటాడు. భవాని అనుమానంగా చూస్తుంది.
ఆ తర్వాత మురారి కవర్ చేస్తాడు. మీ మధ్య ఏదో సమస్య ఉందని తెలుస్తుంది కానీ ఇకనుండి మీరు నేను చెప్పినట్టు నడుచుకోవాలని భవాని చెప్పేసి వెళ్ళిపోతుంది. ముకుంద గదిలోకి అలేఖ్య వచ్చి.. షాంపూ కావాలని అడుగుతుంది. షాంపు తీసుకొచ్చిన ముకుంద.. నేను చెప్పిన విషయం ఎక్కడిదాకా ఆలోచించావని అలేఖ్యతో అంటుంది ముకుంద. ఇంకా పెద్ద అత్తయ్యతో చెప్పలేదని అలేఖ్య అనగా.. నువ్వు వద్దులే నేనే చెప్తానని ముకుంద అనగానే లేదు నేనే చెప్తానని అలేఖ్య ఫిక్స్ అవుతుంది.
భవాని హాల్లో కూర్చొని కృష్ణ, మధుల గురించి ఆలోచిస్తుంటుంది. అప్పుడే అటుగా వెళ్తున్న ముకుందని భవాని పిలిచి.. ఆ రోజు ఏదో చెప్పాలనుకున్నావ్ గా ఏంటది అని అడుగుతుంది. ఇదే రైట్ టైమ్ అనుకున్న ముకుంద.. లేనిపోనివన్నీ చెప్తుంటుంది. అప్పుడే మధు, అలేఖ్య చూస్తారు. ఎలాగైనా ముకుందని భవానికి చెప్పనీయకుండా చేయాలని మధు భావిస్తాడు. సారీ ఫర్ ది డిస్టబెన్స్ అని చెప్తూ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్లిన మధు.. టిఫిన్ చల్లారిపోతుంది, వేడిగా ఉన్నప్పుడే తినేయాలని మీరే చెప్పారు కదా అని భవానితో అనగానే.. డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. మధు కావాలనే చెప్పనీయకుండా చేశాడని ముకుంద అనుకుంటుంది. మరొకవైపు కృష్ణ, మురారిలు గదిలో రెడీ అవుతుంటారు. కృష్ణ నడుముని మురారి చూస్తు.. టెంప్ట్ అవుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.