English | Telugu
మెడలోని తాళి తెగిపోవడంతో కృష్ణ కన్నీటి పర్యంతం.. పరిష్కారమేంటని భవాని ఆందోళన!
Updated : Aug 1, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -224 లో.. కృష్ణ తలస్నానం చేసి వచ్చి మురారి ముందే తల తూడ్చూకుంటుంటే.. తన వైపు రొమాంటిక్ గా చూస్తాడు మురారి. ఏంటి ఏసీపీ సర్ అని కృష్ణ అడుగుతుంది. వాచ్ కోసం వచ్చానని మురారి చెప్తాడు. కాసేపు ఇద్దరి మధ్య చూపులు రొమాంటిక్ గా సాగుతుంటాయి. అంతలోనే డ్యూటీకి టైమ్ అవుతుందని ఇద్దరు గది బయటకు వచ్చేస్తారు.
మరొక వైపు ఇంట్లో అందరు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని కృష్ణ, మురారి ల కోసం వెయిట్ చేస్తుంటారు.అప్పుడే వాళ్ళిద్దరు పై నుండి కిందకి వస్తారు. మురారి వాళ్ళతో కలిసి భోజనం చెయ్యడానికి కూర్చొని ఉంటాడు. కొన్ని రోజులు అయితే వీళ్ళకి సేవ చేసే అవకాశం ఉండదని కృష్ణ అనుకొని.. నేను మీకు వడ్డిస్తానని వాళ్ళకి టిఫిన్స్ వడ్డీస్తుంది. అయితే రవ్వ దోస అయిపోయిందన, ఫ్రిడ్జ్ లో పిండి ఉంది తీసుకొని రా అని కృష్ణని రేవతి పంపిస్తుంది. కృష్ణ పిండి తీసుకొని రావడానికి వెళ్తుంది. అయితే ఫ్రిడ్జ్ లో నుండి పిండి గిన్నె తీస్తుండగా.. బాటిల్ కి ,కృష్ణ మెడలోని మంగళసూత్రం చిక్కుకొని తెగిపోతుంది. అలా తెగిపోయిన మంగళసుత్రాన్ని చూసి కృష్ణ ఏడుస్తుంది.
అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అందరూ వచ్చి కిందపడిపోయిన పూసలని ఎరుతారు. వీళ్ళబంధం శాశ్వతం కాదు అందుకే ఇలా జరిగిందని ముకుంద తనలో తానే అనుకుంటుంది. కృష్ణ కూడా అలాగే ఆలోచిస్తుంది. నా కొడుకు కోడలి విషయంలో ఎందుకిలా జరుగుతుందని రేవతి బాధపడుతుంది. మీరు ఏం టెన్షన్ పడకండి సిద్ధాంతి గారికి ఫోన్ చేసి రమ్మని చెప్తానని సిద్ధాంతికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది భవాని. మరొక వైపు అలా జరగడంతో కృష్ణ బాధపడుతు ఉండగా.. కృష్ణ ఏం తినలేదని మురారి జ్యూస్ తీసుకొని వచ్చి తనకి ఇస్తాడు. తను తాగదు, మురారి దగ్గరుండి తాగిస్తాడు.
ఆ తర్వాత కృష్ణని జోక్స్ చేస్తు నవ్విస్తాడు మురారి.
మరొక వైపు అందరూ హాల్లో ఉంటారు. అందరు రెండు, మూడు రోజులు ఎక్కడికి వెళ్ళకండని భవాని చెప్తుంది. సిద్ధాంతి గారు వచ్చాక ఏదైనా పూజకి సంబంధించినవి ఉంటే అన్ని ఏర్పాటు చేయమని రేవతికి భవాని చెప్తుంది. సిద్ధాంతి రాగానే రేవతి తప్ప అందరిని అక్కడ నుండి వెళ్ళిపోమంటుంది భవాని. జరిగిందంతా సిద్దాంతికి భవాని చెప్తుంది. ఈ మధ్య వాళ్ళు సంతోషంగా ఉండడం లేదు, వాళ్ళు సంతోషంగా ఉండటానికి ఏం చేయమని చెప్పినా చేస్తానని భవాని అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.