English | Telugu

గడ్డాలు, మీసాలు తీసేసి శ్రీముఖిని మోసం చేసిన బ్రిట్టో

నీతోనే డాన్స్ 2 .0 ఈ వారం శనివారం ఎపిసోడ్ భలే క్యూట్ గా సాగింది. ఈ వారం థీమ్ ఏంటంటే రెట్రో స్పెషల్ ... ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నమాట. కంటెస్టెంట్స్ అంతా కూడా ఓల్డ్ కాస్ట్యూమ్స్ వేసుకొచ్చి డాన్స్ పెర్ఫార్మెన్సెస్ ని ఇరగదీసేసారు. ఇక హోస్ట్ శ్రీముఖి ఐతే మహానటి గెటప్ లో అద్దిరిపోయింది. ఐతే ఒక విషయంలో బుంగమూతి పెట్టుకుని కూర్చుంది. ఈ షోకి అందరూ జంటలుగా, జోడీలుగా ఎవరికీ నచ్చిన వాళ్ళను వాళ్ళు తెచ్చుకుంటున్నారు ఈరోజు తాను కూడా తన రాజాను తెచ్చుకున్నట్టు చెప్పింది. "నా కలల రాకుమారుడిని, నా రాజాని చూపించే టైం వచ్చేసింది..రా రాజా" అని స్టేజి మీదకు ఇన్వైట్ చేసింది.

Krishna Mukunda Murari : కృష్ణకి కడుపునొప్పి.. అల్లాడిపోయిన కుటుంబసభ్యులు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -450 లో... అంతా పానకం తాగి, వడపప్పు తిని, పూజ అయిపోవడంతో.. ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్తారు. అయితే రేవతి దగ్గరకు అదర్శ్ వెళ్లి.. పిన్నీ.. అమ్మతో ఓ మాట చెప్పాలి. కానీ భయంగా ఉంది. నువ్వు వెళ్లి.. నేను చెప్పింది చెప్పినట్లుగా తనకు చెబుతావా అని అంటాడు. సరే చెబుతాను. ఏంటా విషయమని రేవతి అడుగగా.. పిన్నీ నేను ముకుందను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. అదే మన మీరా ఉంది కదా.. తనని. తనతో నా జీవితాన్ని ఊహించుకుంటున్నాను పిన్నీ అని అంటాడు.

Karthika Deepam2 :  వాళ్ళకి కార్తిక్ చెప్పాలనుకున్న నిజమేంటి.. నాన్నెవరో శౌర్యకి తెలిసేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2 '... ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -23 లో.. కార్తీక్ వెళ్తుంటే .. శౌర్యకి కొన్న డ్రెస్ తీసుకొని వచ్చి ఎందుకు కొనిచ్చారని దీప అడుగుతుంది. ఎందుకు నా కూతురికి దగ్గర అవ్వాలని చూస్తున్నారు.. మీరు అలా నా కూతురితో చనువు గా ఉండడం.. నాకు ఇష్టం లేదు.‌ ఏ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారని కార్తీక్ ని దీప అడుగుతుంది. మీరు మా అత్తయ్యని ఏ ఉద్దేశంతో కాపాడారని అడుగుతాడు. మీరు కాపాడడంలో ఏ ఉద్దేశం లేనప్పుడు నేను సాయం చెయ్యడంలో ఏ ఉద్దేశం లేదని దీపతో కార్తీక్ అంటాడు.

Eto Vellipoyindhi Manasu : శోభనం గదిలోకి వెళ్ళి డల్ గా ఉన్న అమ్మాయి.. కారణం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -76 లో... సీతాకాంత్ రాగానే శోభనానికి రెడీ అవ్వమని శ్రీలత చెప్తుంది. దాంతో సీతాకాంత్ షాకింగ్ గా.. ఇప్పుడు ఎందుకంటాడు. ఎందుకు అలా అంటున్నారు.. రామలక్ష్మి రెడీ అవమంటే తలనొప్పి అంటూ ఎదో ఒక సాకు చెప్తుంది.. నువ్వు ఇలా అంటున్నావ్.‌. అసలు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అంటు శ్రీలత అడుగుతుంది. చేసుకున్నాం మీరు అలా అనకండి అంటూ సీతాకాంత్ అంటాడు. నా మనవడు సిగ్గుతో అలా అంటున్నాడు అంతే నేను వెళ్లి నా మనవడిని రెడీ చేస్తానని పెద్దాయన అంటాడు.