English | Telugu

Eto Vellipoyindhi Manasu : శోభనం గదిలోకి వెళ్ళి డల్ గా ఉన్న అమ్మాయి.. కారణం అదేనా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -76 లో... సీతాకాంత్ రాగానే శోభనానికి రెడీ అవ్వమని శ్రీలత చెప్తుంది. దాంతో సీతాకాంత్ షాకింగ్ గా.. ఇప్పుడు ఎందుకంటాడు. ఎందుకు అలా అంటున్నారు.. రామలక్ష్మి రెడీ అవమంటే తలనొప్పి అంటూ ఎదో ఒక సాకు చెప్తుంది.. నువ్వు ఇలా అంటున్నావ్.‌. అసలు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అంటు శ్రీలత అడుగుతుంది. చేసుకున్నాం మీరు అలా అనకండి అంటూ సీతాకాంత్ అంటాడు. నా మనవడు సిగ్గుతో అలా అంటున్నాడు అంతే నేను వెళ్లి నా మనవడిని రెడీ చేస్తానని పెద్దాయన అంటాడు.

ఆ తర్వాత గదిలోకి వెళ్లక రామలక్ష్మిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావ్.. శోభనం ఎందుకు వద్దంటున్నావ్? రామలక్ష్మి, అభి ఇద్దరు ప్రేమించుకున్న విషయం గుర్తుకొచ్చిందా అని సీతాకాంత్ ని పెద్దాయన అడుగుతాడు. అసలు మేమ్ పెళ్లి చేసుకోలేదని నిజం చెప్పబోతు ఆగిపోతాడు సీతాకాంత్. ఆ తర్వాత మీరు అన్నదే నిజమని సీతాకాంత్ కవర్ చేస్తాడు. ఆ తర్వాత రామలక్ష్మి రెడీ అయి శ్రీలత అన్న మాటలు గుర్తుకుచేసుకొని బాధపడుతుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. " సర్ నేను నరకం చూస్తున్నాను.. వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక పోతున్నాను" అని సీతాకాంత్ తో చెప్పుకుంటూ రామలక్ష్మి ఏడుస్తుంది. అభి వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగయ్యాక వెంటనే నిన్ను, అభిని ఫారెన్ పంపిస్తానని రామలక్ష్మితో సీతాకాంత్ చెప్తాడు. అప్పుడే శ్రీవల్లి వచ్చి మిమ్మల్ని అత్తయ్య రమ్మంటుందని పిలుస్తుంది.

ఆ తర్వాత శ్రీలత వాళ్ళు పెళ్లి చేసుకోలేదన్న విషయం బయట పెట్టడానికి.. కావాలనే పూలబంతి ఆటకి ఏర్పాట్లు చేస్తుంది. రామలక్ష్మి, సీతాకాంత్ లు వచ్చి చూసి షాక్ అవుతారు. పెద్దాయన పూలబంతి ఎందుకు ఆడుతారో చెప్తాడు. ఎప్పుడెప్పుడు పెళ్లి కాలేదన్న విషయం బయటపెడుతారని శ్రీలత వెయిట్ చేస్తుంటుంది. ఇద్దరు పూలబంతి ఇష్టం లేకుండా ఇబ్బంది పడుతూనే విసురుకుంటారు. ఆ తర్వాత రామలక్ష్మిని పాల గ్లాస్ తో గది లోపలికి పంపిస్తారు. సంవత్సరంలోపు నాకు మనవడినో.. మనవరాలినో ఇవ్వాలని శ్రీలత అంటుంటే రామలక్ష్మి ఇబ్బందిపడుతుంది. రామలక్ష్మి గదిలోకి వెళ్లి డల్ గా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.