English | Telugu

Karthika Deepam2 :  ఇంట్లో నుండి వెళ్ళకుండా దీపని అడ్డుకున్న కార్తిక్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' కార్తీకదీపం2'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-14 లో.. దీప, శౌర్య కలిసి అవుట్ హౌస్ లో ఉంటారు. కాసేపటికి దీప దగ్గరికి పారిజాతం వస్తుంది.  అంతా బాగుందా అని పారిజాతం అడుగగా.. బాగానే ఉందని దీప అంటుంది. ఏ ఊరని , ఏం చేస్తుంటావని , ఇక్కడి మాలాంటి పెద్దొళ్ళ ఇంట్లో పనిచేయడానికే వచ్చావా అని దీపని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంది. తప్పక‌ ఇక్కడ ఉండాల్సి వస్తుందని దీప అనగా.. నాలాంటి ఆత్మాభిమానం గల వారైతే ఒక్క నిమిషం కూడా ఇలా ఉండరు. అలా ఉండాలంటే ఒక్కటి తింగరిదైనా అయి‌ ఉండాలి. లేదంటే మోగుడు వదిలేసిన ఆడదైనా అయి ఉండాలని దీపని పారిజాతం తక్కువ చేసి మాట్లాడుతుంది. అలా   తక్కువ చేసి మాట్లాడకండి మేడమ్ పాప వింటే బాధపడుతుందని దీప అంటుంది. ఇక ఇక్కడ ఉండాలో లేదో నీ ఇష్టం అని పారిజాతం చెప్పేసి వెళ్ళిపోగానే‌.. దీప బ్యాగ్ తో బయటకు వెళ్ళాలని శౌర్యని తీసుకొని వస్తుంది. 

Brahmamudi : వెన్నెల కోసం కావ్య చేసే ప్రయత్నం ఫలిస్తుందా! 

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' బ్రహ్మముడి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 379 లో..  రాజ్ ఆఫీస్ భాద్యతలు కళ్యాణ్ కి అప్పగించడానికి లాయర్ ని పిలిపిస్తాడు. రుద్రాణి మాత్రం తన మనసులో అధికారం మొత్తం రాహుల్‌కి రావాలని కోరుకుంటోంది. ఇక రాజ్ నిర్ణయాన్ని కావ్య కూడా వ్యతిరేకించింది. రాజ్ అంత పెద్ద నిర్ణయం తీసుకుంటే నువ్వేం మాట్లాడవేంటి కావ్యా? నీ అభిప్రాయం చెప్పవేంటి?’ అని ఇందిరా దేవి అంటే.. అభిప్రాయం.. నాది.. ఏ గుర్తింపు ఉందని నా అభిప్రాయానికి గుర్తింపు ఉంటుంది. నా దృష్టిలో రాజు ఎప్పుడూ రాజే.. రాజు సింహానం మీదే ఉండాలి తప్ప పరివారం మధ్య కాదు.. నాకు నా భర్త ఆస్తి మొత్తం కళ్యాణ్‌కి రాసి ఇచ్చినా అభ్యంతరం లేదు కానీ.. నా భర్త తన స్థానాన్ని కోల్పోవడం నేను చూడలేనని కావ్య అంటుంది.

Guppedantha Manasu : నీ లైఫ్ నీ ఒక్కదానిదే కాదు.. మనుది కూడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1045 లో..  లెటర్ రాసి వెళ్ళిపోదామనుకున్న అనుపమని ఎక్కడికి వెళ్ళకుండా వసుధార, మహేంద్ర ఆపేస్తారు. ఇంటికొచ్చిన అనుపమతో మహేంద్ర మాట్లాడుతుంటాడు. నువ్వు వెళ్లిపోవాలనేది నా ఉద్దేశం కాదు అనుపమా.. నువ్వు హ్యాపీగా ఉండాలి.. ఇక్కడే ఉండాలి.. ప్రతి ఒక్కరికీ జీవితంలో గడ్డు పరిస్థితులు ఉంటాయి. జీవితం ఎవ్వర్నీ వదిలిపెట్టదు. కొన్ని నెలలక్రితం నేను.. నాతో పాటు వసుధార గడ్డుపరుస్థితుల్ని ఎదుర్కొన్నాం.. ఒక్కొక్కరిదీ ఒక్కో టైమ్ అని మహేంద్ర అంటాడు.

తాగుబోతు రమేష్ జీవితంలో ఇంత విషాదం ఉందా...

ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీ చాలా అలరించింది. ఇందులో శ్రీదేవి డ్రామా కంపెనీ కాస్తా శ్రీదేవి పురంగా మారిపోయింది. ఎందుకంటే కోరికలు తీరని వాళ్లంతా దెయ్యాలై ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి. ఆది, నరేష్  వాళ్లంతా ఎంటర్టైన్ చేసి ఆ దెయ్యాలకు విముక్తి కల్పించారు. ఒక్కో సెగ్మెంట్ ఒక్కోలా నవ్వించింది. చివరిగా ఏఐ టెక్నాలజీ ద్వారా చనిపోయిన పండు, ప్రవీణ్, తాగుబోతు రమేష్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడించి వాళ్ళని సంతోషపెట్టారు. ఇక ఈ సెగ్మెంట్ లో తాగుబోతు రమేష్ చాలా ఏడ్చేశాడు. "పొద్దున్న లేచి ఎదురుగా కనిపించేది అమ్మ. వాళ్ళు ఎన్ని తిట్టినా, కొట్టినా చివరకి అమ్మ అంటే అమ్మే..మీకు మీ అమ్మగారితో ఉన్న రిలేషన్ గురించి చెప్పండి" అని రష్మీ అడిగింది. "నాకనే కాదు అందరికీ అమ్మలతో చాలా అటాచ్మెంట్  ఉంటుంది.