Read more!

English | Telugu

Krishna Mukunda Murari : నొప్పి ఎక్కువగా వస్తుంది అత్తయ్య.. చచ్చిపోతానేమోనని భయంగా ఉంది!

స్టార్ మా టీవీ లో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి '. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -449 లో... తనని అవమానించాడని అదర్శ్ ఏం చేశాడో మొత్తం మురారీకి చెప్పేస్తుంది కృష్ణ. దాంతో తననే పిలిచి అడుగుతానని మురారి అనగానే.. పండగ కూడ వద్దని కృష్ణ అంటుంది. అప్పుడే మీరా వాళ్ళిద్దరికి వస్తుంది. దాంతో కృష్ణ అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

ఏంటి మురారి గారు ఏం అయినా సమస్యనా అని మీరా అనగా.. ఏవో చిన్నచిన్న గొడవలని మురారి అంటాడు. ఇక మీరా తనలోని ప్రేమనంతా మురారీకి చూపించాలని ప్రయత్నించినా మురారి లైట్ తీస్తుంటాడు. ఇక భవాని వచ్చి పంతులు గారు వచ్చే టైమ్ అయిందని రెడీ అవ్వమని మురారీతో అనగానే.. తను వారి గదిలోకి వెళ్తాడు. అక్కడ కృష్ణ తన మనసులోని ప్రశ్నలని మురారి ఎదుట పెడుతుంది. ఆదర్శ్ కి ఎవరో నూరిపోస్తున్నారని కృష్ణ చెప్పగా.. అదంతా నీ భ్రమ, వాడెప్పుడు ఎలా ఉంటాడో వాడికే తెలియదని, ఎక్కువగా ఆలోచించకని మురారి అంటాడు. వీరిద్దరు మాట్లాడుకనే మాటలన్నీ చాటుగా విన్న మీరా.. అమ్మో నా మీద డౌట్ వచ్చేలా ఉంది. ఎలాగైనా కవర్ చేయాలనుకుంటుంది. ఇక అందరు కలిసి రెడీ అయి పూజ దగ్గరికి వస్తారు. పీటలమీద మురారీ, కృష్ణలు కూర్చుంటారు. మీరా పక్కనే ఆదర్శ్ కూర్చుంటాడు. ముకుంద విషయం ఇక అమ్మతో మాట్లాడాలి. తనపై నా ఇష్టాన్ని అమ్మకు చెప్పాలని ఆదర్శ్ మనసులో ఫిక్స్ అవుతాడు.

ఇక పూజ పూర్తికాగానే ప్రసాదం తెమ్మని రేవతికి భవాని చెప్తుంది. దాంతో నేను తెస్తానని మీరా అంటుంది. వంటగదిలోకి వెళ్లిన మీరా.. గ్లాసుల్లో పానకం పోస్తుంది. ఒక్క గ్లాసులో తను తెచ్చిన టాబ్లెట్స్ వేసి బాగా కలుపుతుంటుంది. ఏం కలుపుతున్నావంటు అప్పుడే సంగీత వస్తుంది. అది విని మీరా షాక్ అవుతుంది. హో.. బెల్లం తక్కువైందని కలుపుతున్నావా.. సరేలే.. కానీ మా అమ్మ నన్ను బలవంతంగా ఇక్కడి పంపింది. ఆదర్శ్ బావకు నేనే పానకం ఇవ్వాలట అని సంగీత అనగా.. తనేం చూడలేదని మీరా రిలాక్స్ అవుతుంది. కాసేపటికి మిగతా వారందరికి పానకం, ప్రసాదం సంగీతకి ఇచ్చి పంపిస్తుంది‌‌. ఇక కృష్ణ కోసం కలిసిన గ్లాస్‌ ఉన్న ప్లేట్‌ని తనే పట్టుకుని వెళ్ళి కృష్ణతో ఆ గ్లాస్ పానకం తాగించేస్తుంది మీరా. ఇక తరువాయి భాగంలో కృష్ణకు కడుపునొప్పి మొదలవుతుంది. అది ఎక్కువ కావడంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్లడానికి ఇంట్లో వాళ్ళంతా కార్ లోకి ఎక్కిస్తారు. నొప్పి చాలా ఎక్కువగా వస్తుంది అత్తయ్యా.. చచ్చిపోతానేమో అని భయంగా ఉంది అత్తయ్య అని కృష్ణ అనగానే.. అందరు కంగారుగా చూస్తుంటారు.  ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.