English | Telugu

కాళ్ళు పట్టుకుని సుందరం మాష్టర్ చేస్తానన్నా...



చెఫ్ మంత్ర సీజన్ 3 ఈ వారం ఆహాలో స్ట్రీమ్ అవుతోంది. ఈ ఎపిసోడ్ కి ఈ వారం సుందరం మాష్టర్ మూవీ టీమ్ నుంచి దివ్య శ్రీపాద, వైవా హర్ష ఇద్దరూ వచ్చారు. ఇక ఈ మూవీకి సంబంధించి హోస్ట్ నిహారిక వాళ్ళను కొన్ని క్వశ్చన్స్ కూడా వేసింది. "ఇప్పటి వరకు సపోర్టింగ్ రోల్స్ చేసావ్ కదా మరి సుందరం మాష్టర్ మూవీ ఆఫర్ ఎలా వచ్చింది.. ఆ ఆఫర్ ని నువ్వెలా ఓకే చేసావ్ అని అడిగింది. "నేను ప్రత్యేకంగా ఈ మూవీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.

అలా అని ఎవరినీ కూడా కలవలేదు. నేనేం అనుకుంటాను అంటే చిన్నదైనా, పెద్దదైనా కానీ ఒక రోల్ వస్తే దాన్ని అద్భుతంగా ఎలా పెర్ఫార్మ్ చేయాలా అని ఆలోచిస్తాను. ఐతే నేను మంత్ ఆఫ్ మధు మూవీ చేస్తూ ఉండగా.. ఆ మూవీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కళ్యాణ్ సంతోష్ అనే ఒకాయన పని చేశారు. ఒకరోజు ఆయన నాతో మాట్లాడాడు. హీరో కింద మీరే నటించే ఒక స్క్రిప్ట్ రాసాను అని చెప్పాడు. ఆ సినిమా నేనే చేయాలి అని అడిగాడు. ఐతే ముందు స్క్రిప్ట్ వినాలి కదా. విన్నాక నో చెప్పేద్దామని కూర్చుని విన్నా. ఎందుకంటే నా స్పేస్ లో నేను కంఫర్ట్ గా ఉన్నా. నా రోల్స్ నాకు వస్తున్నాయి. మళ్ళీ ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకు అనుకున్నా. అందుకే స్టోరీ విన్నాక నో చెప్పేద్దామని అనుకున్నా. ఆ స్టోరీ విన్నాక వెంటనే కళ్యాణ్ సంతోష్ కాళ్ళు పట్టేసుకుని ఈ స్టోరీ ఇంక ఎవరికీ చెప్పకు అని ఆ సినిమాను నేనే చేస్తాను అని ఓకే చేసేసా." అని చెప్పాడు హర్ష. "నువ్వెలా ఈ స్టోరీని ఎలా ఒప్పుకున్నావ్.. అసలే నీకు అన్నీ కూడా పద్దతిగా ఉండే రోల్స్ ఇస్తున్నారు అని ఎప్పుడూ అనిపించలేదా " అని దివ్య శ్రీపాదని అడిగింది. "స్టోరీలో నిజాయితీ ఉంది. చాలా బాగుంటుంది అని అనిపించింది. ఐతే నాకు నేను కొన్ని రూల్స్ పెట్టుకుంటా.. లీగల్ ఇల్లీగల్ అనే వాటిల్లో లీగల్ పనులే చేస్తుంటాను. మిగతా వాటి జోలికి అస్సలు పోను. అంటే రూల్స్ రామానుజం టైప్ నేను. ఐతే ఇప్పుడు అనిపిస్తోంది. లైఫ్ లో ఇంత పద్దతిగా ఉంటాను రోల్స్ కూడా అవే వస్తున్నాయి. కాబట్టి ఏదైనా డిఫరెంట్ చేయాలని ఉంది అని చెప్పింది." దివ్య శ్రీపాద. ఇక నీహారిక వెంటనే ఎవరైనా క్రియేటివ్ డైరెక్టర్స్ ఉంటే గనక వెంటనే దివ్యకి మంచి నాటీ రోల్స్ ఇవ్వండి అంటూ ఒక అనౌన్స్మెంట్ చేసింది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.