Facebook Twitter
'ఆమె' - బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

ఆమె'


- బొమ్మారెడ్డి వెంకట రామిరెడ్డి

 

చూపుల చురకలతో

నా హృదయాన్ని చీల్చు

ప్రేమనదినై ప్రవహిస్తాను

నీ పాదపద్మాలను

ప్రక్షాళిస్తాను!!

 

ఫాలం మీద

పాడ్యమి నెలవంక సద్దుతావు....

ఆనందకైలాసంలో

అర్థనారీశ్వరుణ్ణవుతాను!

ప్రేమ - ద్వేషం

కలువలు!

రాగం - క్రోధం

వాటి వలువలు!!

 

ప్రేమతో లాలిస్తావు!

ప్రేమతో శాసిస్తావు!!

ప్రేమతో పాలిస్తావు!!!

ప్రేమతో ద్వేషిస్తావు!!!!

 

ప్రేమించడం ఒక కళ

ద్వేషించడం ఒక కళ

ప్రేమించే హృదయంతో

ద్వేషించడం గొప్ప కళ!

 

సశేషం