Facebook Twitter
కలికాలం (కవిత)


కలికాలం


వస్తాయ్ .. వస్తాయ్
బూతుల్.. రోతల్
రాతల్ .. చేతల్

చూస్తాం .. చూస్తాం
కళ్ళు తెరిచి .. సొల్లు గార్చి
ఒళ్ళు మరచి .. సిగ్గు విడిచి

తెర మీద బొమ్మ నగ్నంగా ఎగిరితే ఎంటర్టైన్మెంట్ ...
రోడ్డు మీద వెళ్ళే అమ్మాయి చీర తప్ప
మరే బట్ట కట్టినా అది రేప్ కు ఉత్ప్రేరకం ...

పదేళ్ళ కుర్రాడు అమ్మాయి ఒంటి కొలతల గురించి మాట్లాడితే
అది పగలబడి నవ్వే జోకు ...

ఐటమ్ సాంగ్లంటూ ఆడదాని ఒంటి మీద
డబుల్ మీనింగ్ పాటలు పెడ్తే
కళ్ళకు , చెవులకు కిక్కే కిక్కు ...

పురాణాల్లో తప్పు చేసినోడు దుస్శాసనుడు
అదే తప్పు అందంగా చేస్తే హీరో ...

రేప్ చేస్తే చేయించుకోవాలి అన్నోడికి సపోర్ట్ చేసే
చదువు'కొన్న' లాయర్లు ...

ఆడదానికి ఆడదే శత్రువై
ఉన్నత స్త్రీ పై పిచ్చి రాతలు, గీతలతో
ఆడ జర్నలిస్ట్ పత్రికా వ్యభిచారం
సారీ .. వాళ్ళు దాన్ని పత్రికా స్వేఛ్చ అంటారేమో...

తోటి విద్యార్థినిని అర్ధనగ్నంగా తిప్పి
ఆత్మహత్య చేసుకునేలా చేసిన విద్యార్థిని ..
మరేమో ఉన్నతమైన చదువులు కదండీ .. అంతా గురుదేవుల చలవే ...

కాషాయం కట్టినోడు కడుపులో తంతే పిల్లలు పుడుతారు ..
మా నమ్మకాలు మావి .. డిస్టర్బ్ చేయకండి...

కరడు గట్టిన ఉగ్రవాదిని ఉరితీసినా ఊరుకోం ...
ఎందుకంటే మా మతం ...
చచ్చిపోయిన వందలాది మంది భరతకులమైతే మాకేంటి ?
మాకు మా మతమే గొప్ప ...

ఒరేయ్ చంటి! పెద్దయ్యాక ఏమవుతావ్?
రాజకీయ నాయకున్నవుతా ...
ఎన్ని నేరాలు చేసినా శిక్షలుండవ్ ..
జైలుకెల్లినా రాజభోగాలే ...

ఓటుకు నోటు , మందు చూపిస్తే
కుక్కకైనా ఓటేస్తాం ..
హహ్హహ్హ ..ప్రజాఆఆఆస్వామ్యం ...

నాకో డౌటు ...
కీచకపర్వం ఆనాడు భారతంలో జరిగినదా? ..
నేడు కలియుగంలో జరిగేదా?
పాపం ఇంకా దుర్యోధన, దుస్శాసనులను
ఆడిపోస్కోవటం అన్యాయం కదూ !

 

 

 

...సరిత భూపతి