Facebook Twitter
ఆమ్ ఆద్మీ


ఆమ్ ఆద్మీ




నేను అనుకున్నదేది నేను కానప్పుడు మరి నేనెవరు?
నేను తుఫానుకు ఎగిరిపోతున్న మట్టి రేణువులా
ఆనందం కోసం అనుక్షణం పరిగెడుతున్న వాడ్ని..

జీవితంలో చల్లుకున్న ఆశల విత్తుల్లో
మెులకెత్తని విత్తనాన్ని...

వాన వెలిసిన తర్వాత
సుారు మీద నుంచి జారే నీటిబిందువులా
కష్టం తీరినపుడు వచ్చే ఒక ఆనందభాష్పాన్ని ...

ఆకలితో అలమటిస్తున్న వాడికి
కడుపునిండా తిండి దొరికినపుడు
వాడి కళ్ళల్లో కదలాడే కృతజ్ఞతాభావాన్ని...

వంగిపోయిన నడుముకు
ఊతాన్నిచ్చే చేతికర్రలా
నా లాంటి నిస్సహయులకు ఆత్మీయపలకరింపుని...

కష్టాల సాగరంలో కాలం
కెరటంలా నెట్టేస్తున్న ఒక అలను ...

ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకుాడదో అర్థంకాక
ఐదేళ్ళకోసారి కళ్ళు ముాసుకొని ఓటు గుద్దుతున్న
ఒక ఓటర్ని
అవును నేనే... ఆమ్ ఆద్మీ ...

 

 

 

---- సరిత భూపతి