Facebook Twitter
బాపు బొమ్మ

 

బాపు బొమ్మ



గుంపులుగా వెలిగే నక్షత్రాలు ఎన్నున్నా
అందాల జాబిలి ఒక్కటే
అవనిలో అమ్మ ఒక్కటే

వేనవేల బొమ్మలెన్నున్నా
బాపు బొమ్మ ఒక్కటే||

అందమైన అమ్మాయి సోయగాలకి
సౌరభాలు అద్దటం మాటలా.....?
అలవోకగా తెలిసిన విద్య బాపు గారికది||

బారెడు జడను సాగ తీయంగా కుచ్చులు వేలాడంగా
చారెడేసి  కళ్ల మధ్యన నిలువు బొట్టు
ఇంకెవ్వరి సాహసం||

కొప్పున పువ్వులు ముడిచిన పేదరాశి
పెద్దమ్మలను మన అత్తయ్యలుగా
మార్చిందెవ్వరు?||

సీతా కళ్యాణానికి బొమ్మల చిగురులు
పూయించినా
రాధా కళ్యాణానికి రంగులద్దినా
అది బాపు గారికే సొంతం||