Facebook Twitter
ఆ పేజీ...

 

ఆ పేజీ...

 



తెరచిన డైరీ మూతబడటం లేదు
తొందరగా
డైరీలో పేజీలు మొరాయిస్తున్నాయి
త్రిప్పబడేందుకు

అయినా నెట్టుకు రాగలుగుతున్నాను
ఎన్నో పేజీలతో
అయినా నెట్టుకు పోగలుగుతున్నాను
ఎన్నో డైరీలతో

ఎందుకో తెలుసా?

ఆ డైరీల్లో, ఓ డైరీలో
ఆ పేజీల్లో, ఓ పేజీలో
తనకిచ్చిన నా మనసుకు
తూట్లు పొడిచిన నా ప్రేయసి
తొలి చూపులో విసిరిన
చిరునవ్వు దాగి వుంది

ఆ మధురానుభూతి చాలు
మనో పేజీ త్రిప్పగలిగేందుకు
ఆ మధుర స్మృతి చాలు
మరో డైరీ మార్చగలిగేందుకు

-ఆచార్య ఫణీంద్ర