Facebook Twitter
వడి వడిగా సాగిపో

 వడి వడిగా సాగిపో

- మనోహర బోగ

 

వడి వడిగాఅడుగులు వేసుకుంటూ

సాగిపో  సాగిపో----
పురుష అహంకారపు ప్రపంచంలో

నిన్ను నీవు నిలుపుకో----
కష్టాల గూడు నీకు తోడైన
చెదరక బెదెరక సాగిపో..
నీ ఓర్పు ,సహనం,కష్టం శ్రీరామ రక్ష కాగ

ఆ దైవమే నీకు తోడు రాడా ...?
వాడి  అహంకారపు జ్వాలల్ని
ఆర్పివేయడా,
అనగదొక్కి నీ ముందు నిలపడా ...?||
బంగారు  తల్లిలా పెంచి కన్నవారు

ఆ బంగారు  తల్లిని అయ్య చేతిలొ పెట్టి

కాలానికి వదిలి వేస్తారు.
కట్టుకున్న వాడు నిన్ను కర్మకి వదిలివేస్తే

మిగిలేది పిల్లలు వారు దూరం

ఐతే చివరకు నీకు నువ్వే మిగులుతావు!
ఐన

వడివడిగ అడుగులు వేసుకుంటూ సాగిపో.!!