Facebook Twitter
తెలుగును చూస్తున్నాను - శారదా అశోకవర్ధన్

తెలుగును చూస్తున్నాను


- శారదా అశోకవర్ధన్

 

నేను పుట్టిన నాటి నుండి

తెలుగు నా శ్వాస

తెలుగే నా ధ్యాస

అమ్మ ఒడిలో ఆటలడుతున్నప్పుడు

మమతే నా భాష

చందమామ వెలుగులో పాటలు పాడుతూ

తెలుగును గుండె నిండా నింపుకుని

నా జాతి వెలిగించిన తెలుగు దీపాల

తోరణాలని చూసి పులకరిస్తూ

తెలుగుతోటలో విహరిస్తున్నాను

నా తాతలు పొందుపరుచుకున్న

వారసత్వాన్ని సంతరించుకుని

పారవశ్యంతో తెలిపోతున్నాను.

తెలుగు భాషకు ముంగురులు

సవరించిన నన్నయ నుంచి

తెలుగును సీమంతరయానం

చేయించిన 'బ్రౌను 'దాకా

తెలుగుబవుటా ఎందరో ఎగురవేశారు

తెలుగు తీపిని తెనేగిన్నేల్లో భద్రపరిచారు.

తెలుగు మొగ్గలు విచ్చుకుంటూ

పరిమళించే సారస్వత పుష్పాలై

ప్రపంచమంతా విస్తరిస్తూ

తెలుగు ఖ్యాతిని పెంచుతున్నాయి

తెలుగు ప్రతిష్ట ప్రపంచమంతా

గాలిలా వ్యాపించింది

ఆ వెలుగులు జలతారుల నడుమ

మెరిసిపోయే తెలుగు తేజాన్ని

చూసి మురిసిపోయాను

 

ముత్యాల ఊయలలో ఊగిపోయాను

కాలరితులు మారిపోతున్నాయి

తెలుగు వారెవ్వరూ తెలుగులో మాట్లాడకపోవడం

అదో వికృతదృశ్యం

తెలుగు మాటను తెలుగు పాటను

ఆటకఫైకెక్కించి

తెలుగు జుట్టుని తెలుగు కట్టుని

తెలుగు బొట్టుని కావ్యాల్లోనే మగ్గబెట్టేసే

అస్తవ్యస్త సన్నివేశాన్ని చూసి

ఆవేదన పడుతున్నాను

 

ఆందోళన పడుతున్నాను

పండుగనాడు మాత్రమే ఫ్యాన్సి ద్రెస్సులా

పంచెకట్టులూ పట్టుచీరలూ

కట్టి తెలుగు తిండి గోడ్డుకారమంటూ

ఆవకాయను చూడగానే అల్లల్లాడిపోయే

తెలుగుడాబులని చూసి నవ్వుకుంటున్నాను

సూపులెన్ని తాగినా కేకులేన్ని కొరికినా

పచ్చిపులుసుని పరమాణ్సాన్ని చూసి

లోట్టలేసేవారిని తలుచుకుని

తెలుగులో ఎంత రుచి వుందో తెలుసుకుని

తెగమురిసిపోతున్నాను

ఏ విద్య నేర్చినా ఏ పదం కేక్కినా

తెలుగురుచి తెలుగులకే తెలుసు

తెలుగుతనం ఎక్కడున్నా తెలుస్తుంది

తెలుగు కట్టు తెలుగు బొట్టు

తెలుగు రుచి అభిరుచి

చుక్కల్లో రోహిణిలగా

నా తెలుగు తళుక్కున మెరుస్తుంది ఎక్కడున్నా

తరగని కీర్తితో వెల్లివిరుస్తుందని

నిరీక్షిస్తున్నాను అందుకే ఇంకా నా తెలుగు

నిత్యచైతన్య స్రవంతిగా

అగ్రస్తానన్నందుకుంటుందని

నిఖిల జగత్తును చుట్టివస్తుందని

నా తెలుగును చూస్తున్నాను

కమలనయననై చంద్రవదననై.