Facebook Twitter
కొత్త'నోటేషన్' రాసుకో! - శారదా అశోకవర్ధన్

కొత్త 'నోటేషన్' రాసుకో!


- శారదా అశోకవర్ధన్

 

ఓటు కోసం సీటు కోసం నోటు కోసం

ఎటు చూసిన కులాల పేరిట కుమ్ములాటలు

మతాల పేరిట పోట్లాటలు

మనిషికి మనిషికీ మధ్య ప్రేమలేదు అభిమానం లేదు

బంధుత్వం లేదు స్నేహం లేదు

కత్తులూ తుపాకులూ స్యై రవిహారం చేయగా

తెగిపడ్డ కుత్తుకల రక్త తర్పణాలు

బాంబుల బడభాగ్ని రేపే మంటలు

కులమతాల ఉన్మాదం

కుటిలత్వానికి నిదర్శనం!

మనుషులను పొట్టన బెట్టుకుంటూ

మానవతను నరుక్కుంటూ

దేవుని పేరిట ఊరేగిపులూ ఉత్సవాలూ

దైవత్వానికి ప్రతికలిమి

పులివేషం కనబడకుండా దాచేందుకు

కప్పుకున్న మేకచర్మం గొంగళి

అబినయించేది భక్తికాదు

కసిని కక్షని కలిపి ముద్ద చేసిన విషాన్ని

దాచుకున్న వక్షస్థలం

ఫై శాచిక క్రీడా వినోదానికి కేటాయించిన రంగస్థలం

మానవత్వమే చచ్చిపోయాక మతాలుమిగిలేదేవరికోసం ?

కులాల ఘోషలు ఎందుకోసం?

ఈ గాండ్రింపులు ఓండ్రింపులు ఇంకా ఎందుకు?

ఈ రంగస్థలానికి తెరిపడిపోవాలి

కొత్త స్క్రిప్టును రాసుకుని కొత్త రాగాలను పలికిస్తూ

గాత్రకచేరి చెయ్యాలి

కొత్త నోటేషన్ రాగాలు రాసుకుని

ఎండిపోయిన మోడునుంచి కొత్త చివుళ్ళు పూయించాలి

పందిపోతున్న బతుకులకు ఆశలు కలిగించాలి!

కులమతాలు గుండెను గుచ్చే ముళ్ళు

తీసిపారెయ్ గుండేతూట్లు పడకుండా

ఆప్యాయత హరివిల్లుని

జివనాకాశంలో పూయించు

బతుకునిండా సప్తవరాలను పండించు