Facebook Twitter
పుడమి తల్లి పదాలు- 5- పి.నీరజ

పుడమి తల్లి పదాలు- 5


- పి.నీరజ

 

లోభ బుద్దితో దాచి

భూత దయనే మరచి

తిరుగు వానితో పేచి

ఓ పుడమి తల్లి

 

పిరికి వానిని నమ్మి

మనసు ఇచ్చిన అమ్మి

బాధ చెందును మమ్మి

ఓ పుడమి తల్లి

 

స్వార్ద బుద్దిని పెంచి

భూత దయనే తుంచి

తిరుగు మరుడే బూచి

ఓ పుడమి తల్లి

 

పెరిగే పెట్రోల్ వ్యయము

ఎడ్ల బండ్లే నయము

ఖర్చు తరిగే పదము

ఓ పుడమి తల్లి

 

లంచ గొండుల శాఖ

వ్యాయ భక్షక శాఖ

నేటి రక్షణ శాఖ

ఓ పుడమి తల్లి

 

భీతి గొల్పెడి కధలు

సెక్సు సీనుల కధలు

స్టార్ టీవీతో వెతలు

ఓ పుడమి తల్లి

 

జాహ్నవి జటలందు

జాబిల్లి శిరనందు

శివునికే కనువిందు

ఓ పుడమి తల్లి

 

ఎదుటి వారల తప్పు

ఎన్ను చుండిన ముప్పు

నీతి నీకును అప్పు,

ఓ పుడమి తల్లి

 

లక్ష్మితోడను తగవు

పుట్టలోనను నెలవు

చేసె పెళ్ళికి అరువు

ఓ పుడమి తల్లి

 

కట్న కానుక లంటు

ఆలి తోడను అంటు

తిరుగు వాడు పేషంటు

ఓ పుడమి తల్లి

 

పొలిసు వారంటు

పీ.వి .కి టంటు

అన్నదో పార్లమెంటు

ఓ పుడమి తల్లి

 

పరుల తప్పులు మరచి

వారి చెలిమిని పెంచి

తిరుగు మనిషే మంచి

ఓ పుడమి తల్లి

 

పనిని చేయని పోరి

మనిని మాత్రము కోరి

మెలుగు మనిషే మారి

ఓ పుడమి తల్లి

 

మాట చెప్పేడి వాడు

గొప్ప కోరెడి వాడు

పనుల జోలికి పోడు

ఓ పుడమి తల్లి

 

పనులు చేసెడివాడు

గొప్ప కోరని వాడు

చెప్పి చేయడు ఎప్పుడు

ఓ పుడమి తల్లి

 

కోడలు ఒక మనిషే

అన్నది తాన్ మరసే

అత్త ఒక రక్కసే

ఓ పుడమి తల్లి

 

వంట వార్పులలోన

అందె వేసిన లలన

మగని మెప్పును వినున?

ఓ పుడమి తల్లి

 

పరుల కష్టము చూచి

సంతసించేడి బూచి

కడకు తానే వగచి

ఓ పుడమి తల్లి

 

రామ విభుని వేడి

రామ పాదుక తోడి

చనియె భరతుడు వీడి

ఓ పుడమి తల్లి

 

పరుల వద్దను కూడు

లాగు కొన్నను కీడు

అంత కన్నను మాడు

ఓ పుడమి తల్లి

 

విషము చిందేదినరుడు

మృగము కన్నను ఘనుడు

పామునకు సరిజోడు

ఓ పుడమి తల్లి

 

మురళి లోలుని ఫైన

చాల మక్కువ తోన

నేను చేసాద రచన

ఓ పుడమి తల్లి