Facebook Twitter
సంధ్య వేళస్రవంతి రాగాలు - ఎమ్ . తుంగరాజన్

సంధ్య వేళస్రవంతి రాగాలు


- ఎమ్ . తుంగరాజన్

 

నీలి నీలి మేఘాల నింగిలోని రాగాలు

నాలోని భావాలూ నీ యవ్వన సరాగాలు

కలలో కవ్వించే నవ్వుల నాయగారాలు

కలంలో జాలువారు నీ ముంగురుల సోయగాలు

 

మనసంతా నీ దైతే వెన్నెలలు నా సొంతం

వసంతాలు పొంగించేది ఈ ప్రేమ సరాగాలు

సాగిపోవు ఈ జీవన స్రవంతి నీ కోసం 

నింగిలోన సాటి నీ కెవ్వరు?

 

చిరునవ్వులు చిందించే అందాలు నీవే

నిను దరిచేరు వేళలో తొలి జల్లులు రాగాలు

పున్నమిలో కురిపించే వెన్నెల మనస్సు నీది

వేణు గానాలుగా వినిపించేను నీ నవ్వుల హరివిల్లులు

 

 

పిల్ల తెమ్మెరల పూలరేకులు నీ కనుపాపలు             

సంగీతంలో రాగాలు నీ కోసమే పుట్టేనులే

సంధ్య వేళ స్రవంతిరాగాలు సాగించేనా

సంబరంలో సోయగాల వొంపులన్ని వర్ణించినా

 

ఎదురుచూపు నీ కోసం ఎంత కాలమమ్మ

ఎటువైపు చూచిన నీ పలకరింపుల కలవరాలు

వెన్నెల వేళలందు దరిచేరు నీ జ్ఞాపకాలు