Facebook Twitter
లిప్ లాంగ్వేజ్

లిప్ లాంగ్వేజ్

డా.సి.భవానీదేవి

 

ఈ మాటల విత్తనాలు
ఎంతకి నాటుకోవేంటి ?
నాటుకొని
మనసు చిగురించదేంటి ?

నవ్వుల ముసుగుల్లో
కెమికల్ వాసనల్తో
రంగుల్ని పులుముకుని
పెదవుల వేదికపై నటించే పదాలు
నిర్జీవంగా రాలిపోతై

ఎన్ని భాషలు భూగోళంపై
ఐనా లిప్ లాంగ్వేజ్ అర్ధాలేవేరు
మమకారపు పొరల్ని కరిగించలేదు
కనీసం ప్లాస్టిక్ దండనలయినా
ఏ మనసుల్లోనూ ఊగించలేదు

చెట్లు రాల్చేఆకుల్లా
ఆనవాళ్ళయినా మిగుల్చుకోకుండా
పెదవుల అంచులపై  నించి జారిపోతూ
అస్తిత్వం లేకుండా మాయమైపోతూ