Facebook Twitter
నా వల్ల కావడం లేదు నిన్ను అర్ధం చేసుకోవడం

నా వల్ల కావడం లేదు నిన్ను అర్ధం చేసుకోవడం

- ప్రియా

 

 ఒకోసారి  ఎంతో ప్రేమ చుపిస్తావ్
ఇంకోసారి   నేనెవరో తెలినట్టే  ప్రవర్తిస్తావ్
నీ ప్రేమను  మొత్తం నా మీద కుమ్మరిస్తావ్
 ఆ ప్రేమలో పూర్తిగా మునిగి పోతాను నేను
ఇంకోన్నిసార్లు  అర్ధించిన కనీసం

నీ మాటకు కూడా నోచుకోను
ఎందుకిల చేస్తున్నావ్

నా మీద నీకు ఎంతో ప్రేమ వుంది !
అనీ మురిసిపోయే క్షణం లోనే
నువు నా వాడివి కాదు   అనేల చేస్తావ్
నా ప్రాణం నువ్వెనన్న విషయం

నికేప్పుడు తెలుస్తుంది

నా ప్రతి తలపు నీతోనే మొదలు
నాలోని  బావలని  అక్షరాలుగా చేయడానికి
నా జీవితం కూడా సరిపోదు
ఈ జన్మకు ఏ జన్మకు
నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను
నా ప్రతి ప్రయత్నం నిన్ను చదవడానికే
అయిన ఏదో లోపం నా ప్రయత్నంలో
అందుకే

నా వల్ల కావడం లేదు నిన్ను అర్ధం చేసుకోవడం