Facebook Twitter
అక్షరం నా ఆయుధం - జయంపుకృష్ణ

అక్షరం నా ఆయుధం


- జయంపుకృష్ణ

 

 

అంతరంగం -

నా ఆశల మందిరం-

అక్షరం

నా ఆయుధం-

భవిష్యత్తు

ఓ రంగులకల

అన్వేషిస్తాను

 

విసిరి, ఓ శ్రామిక వల-

కన్నీటికణాన్ని క

నురెప్పలమధ్య

వత్తి, కత్తిరించి

కాంతినివెలిగిస్తాను-

చీకటిని

కూకటివేళ్లతో పెళ్లగిస్తాను

 

ఆ వెలుగులో దశదిశలా నడుస్తాను

ఆర్తుల

అశ్రుకణాలను తుడుస్తాను-

అక్షరాన్ని అక్షరాన్ని

చెకుముకి కొట్టి

సరికొత్త జ్వాలను

భుగభుగ పుట్టిస్తాను-

 

పపృథ్విలో

నిబిడీకృతమైవున్న స్వార్ధాన్ని

గబగబ నెట్టేస్తాను-

చుట్టూ వున్న

కన్నీళ్ల, కష్టాల ప్రక్షాళన కోసం

చివరికి నన్ను నేను దహించుకుని నేనేవెలుగై

లోకాన్నంతా వ్యాపిస్తాను

శోకాన్ని రూపుమాపేస్తాను-