Facebook Twitter
జ్ఞాపకం

జ్ఞాపకం

- శారద అశోకవర్ధన్

భవిష్యత్తు అనే భవనానికి
    వర్తమానం కొన్నిమెట్లు
    గతం పునాది రాళ్ళు!
    గతం గట్టి అనుభవాల మాలికలైతే
    వర్తమానం వాటిలో పరిమళించే పుష్పాలౌతాయి
    భవిష్యత్తు దివ్యంగా వెలిగిపోయి స్థిరంగా
    నిలిచిపోయే తారక లౌతాయి!
    రేపు మనం ఏమవుతామో తెలుసుకునే ముందు
    నిన్న మనం ఎలా ఉండాలో తలచుకుంటే మేలు
    జ్ఞాపకాలు జీవితానికి వెలుగుచూపే దీపాలు
    కావాలి కాని
    జీవితాలను కాల్చివేసే నిప్పు కణికలు కాకూడదు!
    మనిషిలోని మంచిని పెంచే మార్గదర్శి   
    కావాలి జ్ఞాపకం!
    మనస్సును చంపే 'మాత్ర' మాత్రం కాకూడదు
    చిరస్థాయిగా నిలిచిపోయే చిహ్నం కావాలి జ్ఞాపకం
    భవిష్యత్తులో బంగారం పండించే బీజం
    కావాలి జ్ఞాపకం!