ప్రియతమా
ప్రియతమా

ప్రియతమా.....
నా ప్రణయమా....
వదలకే క్షణమైనా నన్ను
నీ ఎడ బాటు భరించలేను నేను
నా ప్రాణం నువ్వు
నా ఊపిరి నువ్వు
నా ఆలోచనా
నీతోనే మొదలవుతుంది
చూసే కళ్ళకు మనం ఇద్దరం కావచ్చు
కానీ నేను ఏనాడో నీలో ఐక్యం అయ్యిపోయాను
నువ్వు లేని నేను అసంపూర్ణం..
నిను కలసిన క్షణం
నాలో ఎంత ఆనందం కలుగుతుందో
నిను విడిచిన క్షణం అంతకు మించిన
వేదన కలుగుతుంది
నీకు దూరం అయ్యే ప్రతీసారి
నా ప్రాణం పోయినట్టవుతుంది
మళ్ళీ తిరిగి నిన్ను కలుస్తాననే
చిన్ని ఆశే నాకు ఊపిరి పోస్తుంది
నాలోని ప్రతీ అణువు నీ జ్ఞాపకాలతో
నిండిపోయింది......
మన మద్య ఈ దూరాన్ని చిరిపి
మనల్ని దగ్గర చేసేరోజు కోసం
ప్రతీక్షణం ఎదురుచూస్తున్నా
- ప్రియ



