వందనం సైనికుడా..
వందనం సైనికుడా
పవన్ కుమార్

వందనం సైనికుడా..
నీ ధీరత్వానికి వందనం
నీ వీరత్వానికి వందనం
ప్రకృతి విలయ తాండవం ఓ వైపు
నిన్నటి స్వర్గధామం
నేడు స్మశానమై ఓ వైపు
అయినా నీలో ప్రాణభయం లేదు
అలుపు లేదు సొలుపు లేదు
నీ సంకల్పం నీ శక్తి
వరద కాదు కదా ప్రళయం కూడా
కదిలించలేని ఉక్కు సంకల్పం
నీ దేశభక్తి మాకు ఆదర్శం
భక్తి మాత్రమే కాదు ప్రేమ కూడా
దేశం మీద ఈ దేశ ప్రజల మీద
విధి విచిత్రం..
ఆ కారు మబ్బులు నిన్ను బలితీసుకున్నాయి
శవాల మీద మర్మరాలేరుకునే
ఈ క్షుద్ర రాజకీయ నాయకుల్ని మింగినా బాగుండు
దైవం సైనిక రూపం
సైనికుడికి మానవ వందనం



