TeluguOne Services
Copyright © 2000 - , TeluguOne Sahityam - All rights reserved.
నమస్సు
కం !! రావూరి భరద్వాజకు
కావించెద ప్రణతులు శుభాకామనతోడన్
జీవన సమరమ్మున కొక
పావనమగు పధము నిడిన ప్రథితుండనుచున్ !!
కం !! కాంతమ్మ - భరద్వాజుని
స్వాంతమ్మున శాంతినింప - చక్కని గతిలోన్
భ్రాంతిని తొలగించుచు - వి
క్రాంతిని గలిగించు రీతి - కథలు రచించెన్ !!
కం !! బాలలకొరకై కవితా
హేలలు సృష్టించి నాడు - హేరంబుకృపన్ !
తేలియకగు మాటలతో
కాలమునకతీతమైన కవితలు చెప్పెన్ !!
కం !! పాకుడు రాళ్ళు సృజించి - ది
వాకరుడై వెలుగులనిడి వాజ్మయమునకున్
'' రాకాశశి '' వెనుకనగల
రాకాసుల జూపినాడు రసరమ్యముగన్ !!
కం !! భావుకుడై - జీవులపై
లావుగా పాఠకులు మెచ్చు రచనలు చేయన్
రావూరి భరద్వాజకు
దేవుడు వితరణ మొనర్చు దీవెనలు ధృతిన్ !!
పద్యమౌళి, పద్యభాషి
కందకవి సార్వభౌమ
డా. రాధశ్రీ