Facebook Twitter
చైత్ర కుసుమాంజలి

చైత్ర కుసుమాంజలి 

 

వసంత ఋతువు తో కొత్త చిగురు 
కొత్త చిగురుతో కోయిలమ్మ పాట 
కోయిలమ్మ పాట తో క్రొత్త సంవత్సరం 
క్రొత్త సంవత్సరం తో తెలుగోడి వెలుగు  
తెలుగోడి వెలుగు తో చిత్త నక్షత్రం 
చిత్త నక్షత్రం తో  పౌర్ణమి మెరుపు 
పౌర్ణమి మెరుపు తో నులివెచ్చని సొగసు 
నులివెచ్చని సొగసుతో  ప్రకృతి పరవశం 
ప్రకృతి పరవశం తో కుసుమాల మకరందం 
కుసుమాల మకరందం తో పులకరించే పుడమి 
పులకరించే పుడమి తో వ్యాపించే అమృత వర్షిణి 
అమృతవర్షిణి కి ఇదే చైత్ర కుసుమాంజలి 
 

రచన: నాగమణి పగడాల