ఉంటామరి - ఇకశలవు
ఓ విలంబి ఉగాది
స్వాగతం, నీకు సుస్వాగతం
"సంవత్సరాది" - ఉగాది పేరుతో
పెల్లుబికేవుత్సాహానికి ప్రతిరూపం నీవు
ప్రపంచంలోని ప్రతిదేశంలో
ఎప్పుడో ఒకప్పుడు ఏదోఒక పేరుతో
నీవు ఆవిష్కృతమౌతావు
అందరి అభిమానం చూరగొని ఆదరించ బడుతావు
ఐనానీవు కొదరికేమరుపురాని మేలు చేస్తావు
మరిచిపోలేని విషాదిన్ని మిగుల్చుతావు మరికొందరికి
అందుకేనీవు పక్షపాతివి అంటాను నేను
అయినా నిన్ను తప్పక ఆహ్వానిస్తాము
మేము ఆహ్వానించినా ఆహ్వానించకపోయినా
నీవు అందరి జీవితాల్లోకి తప్పక వచ్చి వెళ్తావు
అందుకే నిన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానించి
మా గౌరవం మేము కాపాడుకుంటాము
మాకు మేము మేలు చేసి నీగౌరవం నీవు కాపాడుకుంటావాని ఆశిద్దాము.
గతంలో మాకు జరిగిన కష్టాలను ఏకరువు పెట్టను
నిష్టూరాల నెగాళ్ళను ఎగదొయను
నామటుకు నేను నిర్లిప్తంగానే వుంటాను
ఉగాది పచ్చడిలో
వేప పూతలోని చేదును
మామిడి పిందెల్లోని వగరును
ఉప్పు, పులుపు, కారాల్ని మాయం చేసి
మాకు తీపినే మిగుల్చు మరి
మంచినే చేస్తానని నమ్ముతున్నాను
మరి నీమంచి నీవు నిలబెట్టుకొని
నా మాట దక్కిస్తావని శలవు తీసుకుంటున్నాను
నా మాట దక్కిస్తావుగా మరి,
ఉంటా, ఇక శలవు...
రచన : వి. వరప్రసాదరావు
