పత్రికలు
పత్రికలు
పలువిషయాలను
త్రికరణశుద్దితో
కల్మషం లేకుండా
మనముందుంచేదే 'పత్రిక'
అవనిపై జరిగే వార్తలనన్ని
తాజాతాజాగ
తెల్లవారంగనే తేటపరిచేవి
జాతీయ అంతర్జాతీయ
రాష్ట్రీయ జిల్లా గ్రామీణ స్థాయిలోని వార్తలన్నీ ముందుంచుతుంది
న్యాయాన్యాయాలను
ఆవేదనలను ఆక్రందనలను
ప్రభుత్వ పనులను పథకాలు
వ్యాపారం క్రీడాలేకాదు
క్రిమినల్ విషయాలను
వినోదం విజ్ఞానం కథలు కవితలు ఎన్నెన్నో విషయాలను ఒక్కచోట పొందుపరిచి అందిస్తుంది పత్రిక
పత్రిక శాసిస్తుంది
ప్రతిమనిషి పోకడలనుణ
లోకమంతా తెలిసేలా
పత్రిక అభినందిస్తుంది
విజయం సాధించిన వినయవంతులను
నలుగురికి ప్రేరణనిచ్చేలా
పత్రికలు మంచిని ఎత్తిపట్టి
చెడును తరుముతాయి
పత్రికలు ధరణికి సూర్య చంద్రులే
సి. శేఖర్(సియస్సార్)
