బహుజనోద్దారకుఢు
వెనకబడిన వర్గాలకు వెన్నుముకాయన
వెలుగులోకి నడిపేందుకు
వెనకడుగేయలేదాయన
ఆయాకాలాలకనుగుణంగా
ఆదర్శమూర్తులుద్భవిస్తుంటారు
చీకటినిండిన జనులను నడిపేందుకు నడిపించేందుకు
వారిగుండెల్లో అలుముకున్న
మూఢనమ్మకాలాచారాలను
తరిమివేసేందుకు
వెలుగురేఖలై జీవితాలకు నవచైతన్యం నింపేందుకు
బెదరని గుండెనిబ్బరంతో
సడలని దీక్షధక్షతతో
ఆరిపోని జ్యోతి
మన జ్యోతిరావు పులే కాంతి
చదువే ప్రతి సమస్యకు పరిష్కారమని
అది అందరిహక్కని
మనుషులంతా అందుకోవాలని చాటిన
సంఘసంస్కర్త పూలే
ఎవరేమన్నా తాననుకున్నది
చేసిచూపిన మహోన్నతుడు
ఇంటి ఇల్లాలికి అక్షరాలు నేర్పి
లింగభేదం చదువుకులేదని
నిరూపించిన జ్ఞాననేత్రుడు
సమాజం వెక్కిరించిన
చావు ముందుకొచ్చినా
సడలని సంకల్పంతో
ముందుకుసాగిన ధీరత్వం
ఈనాడైనా ఏనాడైనా
ఆయనెప్పటికి మనందరి
గుండెల్లో చిరంజీవే
ఆయన కలలను నెరవేరిస్తేనే
నిజమైన భారతదేశం
- సి. శేఖర్
