Facebook Twitter
'రైతు' నానీలు

'రైతు' నానీలు

'రైతు' నానీలు

రైతు చిందించును
తన స్వేదం
వచియించదిక్కడ
ఏ వేదం

అతివృష్టిని
అనావృష్టిని
ఎదుర్కొని
నిలబడే సైనికుడు

దళారుల పెత్తనానికి
బానిస
అప్పుల ఊబిలోనే
జీవితమంతా

రైతు కష్టానికింతని
వెలలేదు
రైతే రాజంటున్న
నాయకత్వం

ముడిసరుకులందించు
ముద్దుబిడ్డలు
ముందు గౌరవించాలి
భారతీయులు

 

సి. శేఖర్(సియస్సార్)