Facebook Twitter
అమ్మభాష

అమ్మభాష


అమ్మభాషయనిన,
అమిత మక్కువ నాకు.
అందులో ఏముంది?
అతిశయమును తప్ప,
ఎవరమ్మ భాష,
వారికిని గొప్ప,
అనుచు వెళ్ళకండి,
అభిజ్ఞానులార!
"జంతి భాష" యనుచు,
పొగడిరి కొందరు.
"ఇటాలియన్ ఆఫ్ ది
ఈస్ట్"అనిరి ఇంకొందరు.
నాగమ్మ కొడుకు,
నరసింహ వారసుడు,
కృష్ణదేవరాయలనుచు,
పిలవబడెను తాను.
తల్లి "తుళు"ను వదలి,
తన కన్న మిన్నగా,
తాను ప్రేమించినాడు.
"దేశ భాషలందు తెలుగు
లెస్సనుచు".
రాయలతో బాటుగా,
రాగమందుకొనెను,
వినుగొండ వల్లభుడు,
విలువైన కవి తాను.
సంస్కృతంబు పిదప,
సంపూర్ణ వ్యాకరణము,
కలిగియన్నది నా,
కన్నతల్లి భాష.
"గాలి వీచెను చల్లగా!
గాలి చల్లగా వీచెను!
చల్లగా వీచెను గాలి!
చల్లగా గాలి వీచెను!
వీచెను గాలి చల్లగా!
వీచెను చల్లగా గాలి!
ప్రపంచ భాషలను,
పరికించి చూడుడు.
ఏ భాషలో లేని,
అరుదైన గుణమిది.
పద్యాలు పాడుట, 
తెలుగోని సొమ్మని,
తెలియపరచినారు,
తొలి తెలుగు కవులు.
"పంచె కట్టుట లోన,
ప్రపంచాన మొనగాడెవ్వడు?
తెలుగోడికి గాక
తెగువయెవ్వరికి కలదు.
పంచ భక్ష్య పరమాన్నంబులు,
కంచమున వడ్డింప,
గోంగూరకై గుటకలు వేయువాడు!
ఎవరయ్య,ఎవరనుచు,
అడిగినదెవరన్న?"
నారాయణరెడ్డి గాకనది
నింకెవ్వడు!
కమ్మనైన అమ్మ,
కనులముందుండ!
మమ్మనుచు పార్థివ
దేహంబు పలవరించెదవేళ?
అంతరించిపోవు అధికార
భాషలలో, 
తెలుగుయునూ ఉన్నది,
తెలుసుకొనుడు 
జనులు తెప్పరిల్లి.
చేజారిపోయిన చేతికందదుతాను.
కాపాడుకొనుడు కర్తవ్యమ్ముకలిగి.


ఇందిరా.వెల్ది,