RELATED EVENTS
EVENTS
టాంటెక్స్ కార్య వర్గంలో నూతనోత్సాహం-2014 అధ్యక్షులుగా విజయ్ మోహన్ కాకర్ల ప్రమాణ స్వీకారం

 

 

 

టెక్సాస్ రాష్ట్రంలోని డాలస్ ఫోర్ట్ వర్త్ నగరం తెలుగు సంగీత, సాహత్య, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం. డాలస్ అంటే అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారందరికీ “రాజధాని” గా పలువురు అభివర్ణించిన సందర్భాలు ఎన్నో. ఇక్కడ నివసించే తెలుగువారికి కమ్మనైన అమ్మ భాషంటే ప్రాణం. తెలుగు కళలంటే ఇంకా మక్కువ ఎక్కువ. అందుకే భాషకు పట్టాభిషేకం, సాహిత్యానికి అగ్ర తాంబూలం, కళలకు మంగళ హారతులు మన తెలుగు వారు నిత్యం అందిస్తూనే ఉన్నారు. తెలుగు భాషా సంస్కృతులను పరిరక్షించేందుకు 1986 లో అధికారికంగా స్థాపించబడిన ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అంటే “టాంటెక్స్”, స్థానిక సంస్థ తెలుగువారికి అండగా ఉంటూ అన్నీ జాతీయ సంస్థలకు ధీటుగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకొంది. బీజాక్షరాలు నాటి సంస్థకు గట్టి పునాది వేసి తెలుగు వారి అవసరాలను తీర్చే కార్యక్రమాలను నిర్వహించడంలో టాంటెక్స్ నాయకత్వం సఫలీ కృతం అయ్యిందనే చెప్పుకోవాలి.


ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం, 2014 సంవత్సారానికి గాను నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. 2014-అధ్యక్షుడిగావిజయ మోహన్ కాకర్ల పదవి బాధ్యతలు స్వీకరించారు. డల్లాస్ లో గత 15 ఏళ్లుగా నివసిస్తున్న విజయ మోహన్ టాంటెక్స్ సేవ కార్యక్రమాల్లో ఎంతో చురుకైన పాత్ర వహించారు. అత్యున్నతమైన అధ్యక్ష పదవి స్వీకరించడం ఎంతో అదృష్టంగా ఉంది అని మరియు ఆ పదవికి పూర్తి న్యాయం చేస్తానని వారి పరిచయ ప్రసంగంలో పేర్కొన్నారు.తెలుగు భాషా పరిరక్షణ, భావి తరాలకు మన భాష మరియు సంస్కృతి ఔన్నత్యం కోసం ప్రత్యేక కృషి చేస్తానని  ఆయన తెలియ చేసారు. వినూత్నకార్యక్రమాలతో డల్లాస్ తెలుగు ప్రజలకి చేరువ అవతామని తెలిపారు. డల్లాస్ లో నివసిస్తున్న తెలుగు వారి ప్రయోజనాలను కాపాడి అందరిని ఏక తాటి పైకి తీసుకొస్తామని వారు పేర్కొన్నారు.అధికారిక కార్యనిర్వాహక బృందం
అధ్యక్షుడు : కాకర్ల విజయ మోహన్,
ఉత్తరాధ్యక్షుడు: డా.ఊరిమిండి నరసింహారెడ్డి
ఉపాధ్యక్షుడు : జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం
కార్యదర్శి : ఉప్పలపాటి కృష్ణా రెడ్డి
సంయుక్త కార్యదర్శి : ఆదిభట్ల మహేష్ ఆదిత్య
కోశాధికారి: వీర్నపు చిన్నసత్యం
సంయుక్త కోశాధికారి: శీలం కృష్ణవేణి
తక్షణ పూర్వాధ్యక్షులు:మండువ సురేష్బాల్కి చామకూర, చంద్రశేఖర్ కాజ, జ్యోతి వనం, నీరజ పడిగెల, రఘు చిట్టిమల్ల, రఘు గజ్జల , శారద సింగిరెడ్డి,శశికాంత్ కనపర్తి, శ్రీలక్ష్మి మందిగ, సుభాషిణి పెంటకోట, సునీల్ దేవిరెడ్డి, వెంకట్ దండ, వేణుమాధవ్ పావులూరి. పాలకమండలి బృందం  మూర్తి ములుకుట్ల (అధిపతి), అజయ్ రెడ్డి (ఉపాధిపతి), డా.సి.ఆర్.రావు, శ్రీనివాస్ రెడ్డి గుర్రం, సుగన్ చాగర్లమూడి

తమ పదవీ బాధ్యతలు స్వీకరించిన విజయమోహన్ కాకర్ల “ 2014వ సంవత్సరములో మన సభ్యుల విజ్ఞానం, వినోదం తో పాటు పెరుగుతున్న సభ్యుల అవసరాలకు అనుగుణంగా  కార్యక్రమాలను రూపు దిద్దడానికి నూతనోత్సాహంతో మీముందుకు వస్తున్నాము. చేపట్టబోవు ప్రధాన కార్యక్రమాలను క్లుప్తంగా ఇక్కడ అందిస్తున్నాము. • “గానసుధ” రేడియో కార్యక్రమాలను తిరిగి AM/FM లోకి తీసుకొనిరావడం. గత రెండు సంవత్సరాలుగగా  అంతర్జాలం ద్వారా  నిర్వహించే “గానసుధ” అనుకున్నంత ఫలితాలు మన సభ్యులకు అందించలేదని సభ్యుల స్పందన ద్వారా తెలుసుకోగలిగాం.• విభిన్న సంస్కృతి మరియి సాహిత్య  కార్యక్రమాలతో పాటు, సభ్యుల ఆరోగ్యం మరియు  సుహ్రుద్బావం  పెంపొందించడానికి  క్రికెట్, కబాడీ, వాలీ బాల్, టెన్నిస్ లాంటి వివిధ క్రీడల పోటీలు నిర్వహించడం. ఈ క్రీడలలో మహిళలకు, పిల్లలకు ప్రత్యేక ప్రోత్సాహం అందించడం.• పెరుగుతున్న తెలుగు వారి సంఖ్యాబలంతో పాటు,  మారుతున్న ఆహారపు అలవాట్ల వలన అనారోగ్యం పాలవుతున్న సభ్యులను మనం చూస్తూనే ఉన్నాము. గణనీయంగా  పెరుగుతున్న హృద్రోగం, కాన్సర్ , మధుమేహం, మహిళల , చిన్నపిల్ల ఆరోగ్య సమస్య లను  దృష్టిలో పెట్టుకోని  ప్రత్యేక “ఆరోగ్య అవగాహన సదస్సులు” నిర్వహించటడం.• కళాశాలకు  సిద్ధమౌతున్న పిల్లలకు మరియు వారి తల్లితండ్రులకు ప్రవేశ ధరకాస్తు పద్దతులను  గురించి తెలుసుకోవడానికి  ప్రత్యేక  అవగాహన  సదస్సులతో  పాటు  సేవ కార్యక్రమాల భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక తయారు చేయటం.


 
• ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంది, ఉత్తమ సాహితీ వేత్తల నడుమ మన తెలుగు సాహిత్య వేదిక  ప్రతినెలా నిర్వహించే “నెల నెలా తెలుగు వెన్నెల”,  ప్రవాసంలో పర్యటిస్తున్న తల్లిదండ్రుల ప్రాయోజనార్ధం నిర్వహించే “మైత్రి”, వనితలచే వనితల కోసం నిర్వహించే “వనితావేదిక”, యువతకోసం “స్ఫూర్తి” తదితర  కార్యక్రమాలను బలోపేతం చేయడం.  2013 సవత్సరంలో టాంటెక్స్ అధ్యక్షుడుగా ఇటీవలే పదవీ విరమణ చేసిన తక్షణ పుర్వాధ్యక్షుడు శ్రీ సురేష్ మండువ మాట్లాడుతూ “ గత సంవత్సరంలో భాషా సంస్కృతులతో పాటు మరెన్నో సేవా కార్యక్రమాలతో మన సంస్థ సభ్యుల అవసరాలకు అనుగుణంగా పురోభివృద్ది సాధించింది అనడంలో ఆశ్చర్యం లేదు. విజయమోహన కాకర్ల నేతృత్వంలో నిర్వహించబోయే కార్యక్రమాలకు నా సంపూర్ణ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాను”.  మరిన్ని వివరాలకు www.tantex.org సందర్శించండి.

TeluguOne For Your Business
About TeluguOne
;