RELATED EVENTS
EVENTS
డల్లాస్ లో తెలుగు వెన్నెల కురిపించిన మేడసాని: కేవలం ఎనిమిది గంటలలో శతావధానం

డల్లాస్ (టెక్సాస్) ఆగష్టు 21, 2011

తెలుగు సాహితీ ప్రపంచం లో మరో అద్భుతం జరిగింది. ప్రవాస తెలుగు సాహీతీ పరంపర లో మరో అధ్యాయం లిఖించబడింది. ప్రపంచం లో సంస్కృతం తర్వాత ఒక్క తెలుగు భాష లోనే ఉన్న అవధాన ప్రక్రియ చరిత్ర లో, ఇదో సరికొత్త రికార్డ్. ఒకప్పటి తిరుపతి కవుల తర్వాత దాదాపు 50 సంవస్తరాల పాటు అదృశ్యమై, ఇక తెలుగు అవధానం అంతరిచిపోయిందా అన్నా తరుణంలో లో మరలా అవధాన ప్రక్రియ ను వెలుగు లోకి తీసుకువచ్చి సజీవం చేసినటువంటి అపూర్వ పంచ సహస్రావధాని డా. మేడసాని మోహన్, అమెరికా లో చేసిన మొట్టమొదటి శతావధాన ప్రక్రియ కి, ప్రవాసాంధ్రుల రాజధాని గా పరిగణించబడే డల్లాస్ వేదికైంది. సాధారణంగా 48 గంటలు పట్టే శతావధానం ప్రక్రియ ను, కేవలం 8 గంటల్లో పూర్తి చేసి మరో రికార్డ్ ను సృష్టించారు. ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి సాహిత్య వేదిక ఆధ్వర్యం లో ప్రతి నెల జరిగే 49 వ "నెల నెలా తెలుగు వెన్నెల " కార్యక్రమం లో భాగం గా, స్తానిక DFW హిందూ దేవాలయం ప్రాంగణం లో జరిగిన శతావధానం ఆద్యంతం ఆహుతులను ఆకట్టుకుంది. 100 మంది పృచ్చకుల తో, 200 మంది ప్రేక్షకుల తో ఉదయం 9 గంటలకు ప్రారంభమయిన శతావధానం దత్తపది, సమస్య, కావ్య పథనం, వర్ణన మరియు ఆశువు అంశాలలో పృచ్చకులు వేసిన ప్రశ్నలు ,అవధానుల వారి సమాధానాలు, డల్లాస్ వాసుల తెలుగు భాషాభి మానానికి, భాషమీద వారికున్న పట్టుని, మరియు పంచ సహస్రావధాని మేడసాని మోహన్ అసమాన ప్రజ్ఞ పాటవాలను, వారి జ్ఞాపక శక్తీ కి అద్దం పట్టాయి.

 

సాహిత్య వేదిక సమన్వయ కర్త శ్రీ. అనంత మల్లవరపు కార్య వర్గ సభ్యులైన శ్రీ. రమణ జువ్వాడి, శ్రీ. నసీం షేక్, శ్రీ. సురేష్ కాజ, శ్రీ. విజయ చంద్రహాస్ మద్దుకూరి మరియు డా. నరసింహారెడ్డి ఉరిమిండి ని సభకు పరిచయం చేసారు. ముందుగా ఆలయ పూజారుల వేదమంత్రాలతో, పూర్ణ కుంభం తో అవధానుల వారిని సభ కు ఆహ్వానించారు. శ్రీ మేడసాని మోహన్ గారి చిరకాల మిత్రులు మరియు డల్లాస్ పద్య పితామహుడు డా. పూదూర్ జగదీశ్వరన్ గారు సంధాన కర్త గా వ్యవహరించి పృచ్చకులకు, సభికులకు శతావధాన ప్రక్రియ నియమాలను వివరించారు. ముందుగా దత్తపది అంశంలో, పృచ్చకులు విభిన్న పదజాలంతో సంధించి వారు కోరిన ఉపమానాలను ఎంతో అవలీలగా అవధానుల వారు మొదటి రెండు పాదాలను పూరించారు. సమస్య విభాగం లో అలనాటి అల్లసాని నుంచి ఈనాటి మేడసాని దాకా, అవధానుల వారిని ఇబ్బంది పెట్టే సమస్యలు సంధించి డల్లాస్ వాసులు శ్రీ మేడసాని మోహన్ గారి ప్రశంసలు అందుకున్నారు.

 

ఈ రెండు అంశాలతో పాటు జరిగిన కావ్యపతనం లో భాగం పృచ్చకులు ఎంతో రాగ బద్ధం గా/స్వర బద్ధం గా పా డి నటువంటి పద్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అన్ని అంశాలలో మొదటి ఆవృతం లో పూరించిన రెండు పాదాలను భోజన విరామం తర్వాత అవధానుల వారు మిగతా రెండు పాదాలను పూరించి ధారణ చేసి పృచ్చకులకు అందించారు. అలనాటి భాగవతం, రామాయణం, అముక్త్య మాల్యద లాంటి పురాణ కావ్యాలతో పాటు అవధానుల వారు పూరించిన 100 పద్యాలతో అమెరికా లో జరిగిన రెండో శతావధానం మరియు టెక్సాస్ లో జరిగిన మొట్ట మొదటి శతావధానం ముగిసింది. ఈ కార్యక్రమం ఆసాంతం ప్రముఖ హాస్య రమారంజనులయిన శ్రీ. వంగూరి చిట్టెన్ రాజు చేసిన అప్రస్తుత ప్రసంగం, వాటికి మేడసాని గారు ఇచ్చినటువంటి సమాధానాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించాయి.

తెలుగు సాహితీ ప్రపంచం లో మరో అద్భుతం జరిగింది. ప్రవాస తెలుగు సాహీతీ పరంపర లో మరో అధ్యాయం లిఖించబడింది.తెలుగు సాహితీ ప్రపంచం లో మరో అద్భుతం జరిగింది. ప్రవాస తెలుగు సాహీతీ పరంపర లో మరో అధ్యాయం లిఖించబడింది.

 

 

 

 

 

 

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు శ్రీ. ఎం ఎం ఎస్ రెడ్డి మరియు శ్రీ. తోటకూర ప్రసాద్ సంయుక్తంగా దుశ్శాలువ తో డా. మేడసాని గారిని సన్మానించారు. కార్యక్రమం చివరలో, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు మరియు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు, సంయుక్తం గా శ్రీ. రమణాచారి గారి వేదమంత్రాల మధ్య శ్రీ మేడసాని మోహన్ గారికి, సువర్ణ అంగులికతో, గజమాలతో ఘనం గా సన్మానించారు! శ్రీ గన్నవరపు నరసింహ మూర్తి గారు, శ్రీ సురేష్ కాజ గారు, పూదూర్ జగదీశ్వరన్ గారు శ్రీ మేడసాని మోహన్ గారిని ప్రశంసిస్తూ రాసిన పద్యాలూ అందరి మన్ననలు పొందాయి. శ్రీ మేడసాని వారిని సచిన్ టెండుల్కర్ తో, సూపర్ కంప్యూటర్ తో పోలుస్తూ రాసిన పద్యాలు అందరినీ నవ్వించాయి.

 టెక్సాస్ లో జరిగిన ఈ మొట్టమొదటి శతావధానం కార్యక్రమం విజయవంతం కావడం లో, పాలుపంచుకున్న ప్రుచ్చకులకు, ఇతర నగరాలనుండి మరియు డల్లాస్ పరిసర ప్రాంతాల నుండి వచ్చినటువంటి ప్రేక్షకులకు, మూడుపూటల రుచికరమైన భోజనం అందించిన సరిగమ సూపర్ మార్కెట్ అండ్ కెఫే కు, వేదిక అలంకరణకు చేయూత నిచ్చిన సిరి ఇవెంట్స్ కు, హిందూ దేవాలయం యాజమాన్యం కు, వీడియో తీసిన దేసీప్లాజా కు, లేఖకులు గా తమ విధిని అద్భుతంగా నిర్వహించిన శ్రీ. రాయవరం విజయభాస్కర్, శ్రీ. శ్రీధర్ సిద్ధ లకు, అనేక మంది సేవకులకు, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యకర్త లకు, డా. నరసింహారెడ్డి ఉరిమిండి గారి వందన సమర్పణతో కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమానికి మొదటి నుంచి సహాయ సహకారాలను అందించిన శ్రీ పూదూర్ జగదీశ్వరన్, శ్రీ విశ్వం పులిగండల, శ్రీ తోటకూర ప్రసాద్ గార్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. గత మాసం సాహిత్య వేదిక నాల్గవ వార్షికోత్సవాన్ని దిగ్విజయం గా నిర్వహించి, మరలా ఈ మాసం శతావధాన కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యడం లో శ్రీ అనంత్ మల్లవరపు నేతృత్వం లోని సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులను అందరు అభినందించారు!

తెలుగు సాహితీ ప్రపంచం లో మరో అద్భుతం జరిగింది. ప్రవాస తెలుగు సాహీతీ పరంపర లో మరో అధ్యాయం లిఖించబడింది.తెలుగు సాహితీ ప్రపంచం లో మరో అద్భుతం జరిగింది. ప్రవాస తెలుగు సాహీతీ పరంపర లో మరో అధ్యాయం లిఖించబడింది.

TeluguOne For Your Business
About TeluguOne
;