RELATED EVENTS
EVENTS
డల్లాస్ లో సందడిగా సాగిన టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు

 

 

 


 Click here For More Tantex Sankranti Sambaralu Photos

 

ఉత్తరటెక్సాస్ తెలుగు సంఘం వారు, కాప్పెల్ మిడిల్ స్కూల్ వెస్ట్ లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు సురేష్ మండువ మరియు కార్యక్రమ సమన్వయ కర్త అనంత్ మల్లవరపు అధ్వర్యంలో సహ సాంస్కృతిక కార్యదర్శి శారద సింగిరెడ్డి ఈ కార్యక్రమాలని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శిరీష ఖండవల్లి మరియు వెంకట్ దండ గారు వ్యాఖ్యాతలుగా వ్యవహరించి, సక్రాంతికి సంబంధించిన విశేషాలను వివరించారు. ఈ సందర్భముగా టాంటెక్స్ మహిళా కార్యవర్గ సభ్యులు సభా ప్రాంగణాన్ని బొమ్మల కొలువుతో అలంకరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 175 మంది బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. సుమారు 800 మంది తెలుగువారు ఈ సంబరాలకు హాజరయ్యారు. మయూరి ఇండియన్ రెస్టారెంట్ వారు రుచికరమైన భోజనాన్ని వడ్డించారు.

 


 

2012 అధ్యక్షురాలు గీత దమ్మన గారు, 2012 పాలక మండలి అధిపతి ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారు ప్రసంగిస్తూ తమకు సహాయ సహకారాలు అందించిన కార్యవర్గ సభ్యులందరికి కృతఙ్ఞతలు తెలియచేసారు. గీత దమ్మన గారు సంస్థ నూతన అధ్యక్షులు సురేష్ మండువను సభకు పరిచయం చేశారు. అధ్యక్షులు సురేష్ మండువ 2013 నూతన కార్యవర్గ సభ్యులను పరిచయం చేస్తూ, విజయ్ మోహన్ కాకర్ల ఉత్తరాధ్యక్షుడుగా, నరసింహారెడ్డి ఉరిమిండి ఉపాధ్యక్షులుగా, సుబ్బు జొన్నలగడ్డ కార్యదర్శిగా, కృష్ణారెడ్డి ఉప్పలపాటి సహాయ కార్యదర్శిగా, ఇందు మందాడి కోశాధికారిగా, రఘు చిట్టిమల్ల సహాయ కోశాధికారిగా సభకు పరిచయం చేశారు. డల్లాస్ లోని తెలుగు వారి కోసం ప్రస్తుతం చేస్తున్న సేవ కార్యక్రమాలే కాకుండా, మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలియ చేశారు. సురేష్ మండువ, పాలక మండలి అధిపతి సి.ఆర్.రావ్ అధ్వర్యంలో గీత దమ్మన గారిని, ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి గారిని ఘనంగా సన్మానించారు. తెలుగు వెలుగు సంపాదకులు సుబ్బు జొన్నలగడ్డ సంక్రాంతి సంచికను, కార్యవర్గ సభ్యుల చేతులమీదుగా అవిష్కరింప చేశారు.శిరీష, వెంకట్ దండ గారు తమ వ్యాఖ్యానంలో సంక్రాంతి పండగ విశేషాలైన భోగిమంటలు, గొబ్బమ్మలు, గంగిరెద్దులు , హరిదాసులు, గాలిపటాలు ప్రదర్శిస్తూ అందరిని ఆకట్టుకున్నారు. వాణి ఈశ్వర శిష్య బృందం ప్రదర్శించిన భరత నాట్య కార్యక్రమాలు, కళ్యాణి ఆవుల శిష్యులు చేసిన కూచిపూడి నాట్యం , విజి సోమనాథ్ శిష్యుల గాత్ర కచేరి, గిరిజ ఆనంద్ శివ తాండవం, శ్రీరూప బండ "నా అందం చూడు మామయ్యో" జానపద నృత్యం, శిరీష ధర్మవరం శిష్యుల అన్నమా చార్య కీర్తనలు అందరిని ఆకట్టుకున్నాయి. డల్లాస్ లిటిల్ మ్యుజిసియన్స్ అకాడెమి బాల బాలికలు ఆలాపించిన ‘అంజలి అంజలి అంజలి’ పాట అందరిని అలరించింది.

 

 గత మూడు సంవత్సరాలుగా సేవలందించిన కార్యవర్గ సభ్యులైన శిరీష బావిరెడ్డి , రాజేశ్వరి జుజారే , పూర్ణ వేములపల్లి లను, ఎన్నిక సంఘ సభ్యులను, 2012 టాంటెక్స్ పోషక దాతలను సురేష్ మండువ, గీత దమ్మన, రామకృష్ణ లావు అధ్వర్యంలో సత్కరించారు. ఇతర నృత్య దర్శకులైన యోగిత మండువ, కవిత బ్రమ్మదేవర, కోమల్ బందరు, కవిత విక్టరు, సరిత దేవులపల్లి, సుమ కాజ, ఝాన్సీ చామకుర , సరిత కొండ, సునిత మితకంటి బృందాల చలచిత్ర మరియు జానపద నృత్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమ సమన్వయ కర్త అనంత్ మల్లవరపు, పోషక దాతలైన మయూరి ఇండియన్ రెస్టారెంట్, మై టాక్స్ ఫైలర్, డిస్కవర్ ట్రావెల్, బావార్చి బిర్యాని పాయింట్, బేలర్ మెడికల్ సెంటర్, హోరైజాన్ ట్రావెల్స్, ప్యారడైజ్ బిర్యాని పాయింట్, పసంద్ రెస్టారెంట్, సౌత్ ఫోర్క్ డెంటల్, లాసన్ ట్రావెల్స్, యూనికాన్ ట్రావెల్స్, ఈవెంట్ స్పాన్సర్ అజయ్ రెడ్డి గారికి, దేసిప్లాజా, ఏక్ నజర్ , టివి 9, టోరి , రేడియో కుషి మీడియా వారికి , అందరు కార్యకర్తలకు కృతఙ్ఞతలు తెలియచేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;