RELATED EVENTS
EVENTS
Tantex Dollas Nelanela Telugu Vennela

డల్లాస్ : ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం వారి సాహిత్య వేదిక నెల నెలా నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" 54 వ సమావేశం, ( జనవరి 15) న స్థానిక ఒరీస్ రెస్టారెంటులో జరిగింది. 2012 లో జరుగుతున్న మొట్ట మొదటి ఈ సమావేశం, అందునా సంక్రాంతి పర్వదినాన కావడం తో సాహిత్య అభిమానులందరూ ఉత్సాహం గా పాల్గొన్నారు.

 

ముందుగా గత సంవత్సరం సాహిత్య వేదిక సమన్వయ కర్త గా వ్యవహరించిన శ్రీ మల్లవరపు అనంత్ గారు సభకు సంక్రాంతి శుభాకాంక్షలు అందచేసి 2011 లో సాహిత్య వేదిక కార్యక్రమాలను, ప్రతిష్టాత్మకంగ జరిగిన రజతోత్సవం, శతావధానం లాంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో తోడ్పడిన సాహీతీ ప్రియులకు, సాహిత్య వేదిక సభ్యులకు మరియు ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేసి, 2012 కు గాను సమన్వయ కర్త గా బాధ్యతలను తీసుకున్న, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సంయుక్త కార్యదర్శి శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారిని సభకు పరిచయం చేసారు. గత దశాబ్ద కాలంగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం లో తెరవెనుక బాధ్యతలు నిర్వహించిన శ్రీ సుబ్రహ్మణ్యం గారు, సాహిత్య వేదిక సమన్వయ కర్త గా బాధ్యతలు తీసుకున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా విజయవంతంగా సాగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరి సహాయ సహకారాలతో 2012 లో కూడా విజయవంతం గా నిర్వహిస్తానని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే 2012 కు గాను సాహిత్య వేదిక కార్యనిర్వాహక కమిటిని సభకు పరిచయం చేసారు. శ్రీ జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సమన్వయ కర్త గా, శ్రీ మల్లవరపు అనంత్, శ్రీ జువ్వాడి రమణ, శ్రీ మద్దుకూరి చంద్రహాస్, శ్రీ ఊరిమిండి నరసింహరెడ్డి, శ్రీ కాజా సురేష్, శ్రీ బిళ్ళ ప్రవీణ్ మరియు శ్రీ నసీం షేక్ లతో ఏర్పడిన ఈ కమిటీకి సభకు విచ్చేసిన సాహితీ ప్రియులందరూ శుభాకాంక్షలు అందచేసారు.

 

tantex nelanela telugu vennela, dollas nelanela telugu vennela, tantex dollas sankranthi sambaralu, tantex nelanela telugu vennela 52 celebration

 

కార్యక్రమం లో ముందుగా వెండి తెర వేదిక లో భాగం గా శ్రీ సి. ఆర్. రావు గారు ఇటివల స్వర్గస్తులైన అలనాటి మేటి దర్శకులు శ్రీ విక్టరీ మధుసూదన్ రావు గారిని స్మరించుకున్నారు. 1959 లో ‘సతి తులసి’ సినిమా తో దర్సకత్వంలో అడుగు పెట్టిన మధుసూధన రావు గారు, పాతతరం కధానాయకుల తో చేసిన దాదాపు అన్ని సినిమాలు విజయవంతంగా నడిచాయి. సాంఘిక మరియు పౌరాణిక సినిమాలలో తనదైన ముద్ర వేసిన మధుసూధన రావు గారు, నందమూరి తారక రామారావు తో చేసిన ‘రక్త సంబంధం’, నాగేశ్వరరావు గారితో చేసిన ‘ఆత్మీయులు’అలాగే శోభన్ బాబు తో చేసిన చేసిన ‘మనుషులు మారాలి’ లాంటివి అయన దర్సకత్వ ప్రతిభ కు నిదర్శనం. 85 వ ఏట పరమపదించిన విక్టరీ మధుసూదన్ రావు గారికి నివాళులు అర్పిస్తూ అయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ తన ప్రసంగాన్ని ముగించారు. ఆ తర్వాత సాహిత్య వేదిక సభ్యులైన శ్రీ మల్లవరపు అనంత్ గారు దేవుడికి ఒక హేతువాదికి మధ్య జరిగే సంభాషణ ను చదివి వినిపించారు.

 

మరణించిన హేతువాది తనను మరలా బ్రతికించమని దేవుడితో అడుగుతున్నప్పుడు, జరిగిన సంభాషణలో సృష్టి లో మానవుడు అనుభవిస్తున్న తను సృష్టించాను అనుకుంటున్న వన్నింటికి హేతువు నేను అని దేవుడు దేవుడు అనేవాడు లేదు ఈ సృష్టి అంత సైన్సు మయం ప్రతిది సైధాంతిక ప్రాతిపదిక మీదనే ఆధారపడి ఉంటుంది అని హేతువాది వాదన అందరినీ ఆకట్టుకుంది. జనవరి మాసంలో జన్మించిన, గత సంవత్సరం పరమపదించిన ప్రముఖ గేయ రచయిత శ్రీ వేటూరి సుందరరాంమూర్తి గారిని స్మరించుకుంటూ సాహిత్య వేదిక సభ్యులైన శ్రీ మద్దుకూరి చంద్రహాస్ గారు, 5 నిమిషాలలో సినిమా పాటలు రాయగలిగిన వేటూరి గారి ప్రతిభను గురించి సభకు తెలియచేసారు. ఒక కవిగా, రచయితగా తెలుగు సాహిత్యానికి, తెలుగు సినిమా పరిశ్రమకు వేటూరి గారు అందించిన సేవలు నిరుపమానమైనవని వివరించారు.

 

tantex nelanela telugu vennela, dollas nelanela telugu vennela, tantex dollas sankranthi sambaralu, tantex nelanela telugu vennela 52 celebration

 

స్వీయ రచనల లో భాగంగా, శ్రీ రాయవరం భాస్కర్ గారు, ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం రజతోత్సవం సందర్భం గా తను రాసిన కవితను చదివి వినిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధి, సాహిత్య వేదిక సభ్యుడు అయినటువంటి శ్రీ కాజా సురేష్ గారిని, మరొక సాహిత్య వేదిక సభ్యులు శ్రీ జువ్వాడి రమణ గారు సభకు పరిచయం చేసారు. ప్రతిష్టాత్మక బిట్స్ పిలాని మరియు ఐఐటి కాన్పూర్ ల లో విద్యను అభ్యసించిన సురేష్ గారు, ఐఐటి కాన్పూర్ లో తెలుగు గ్రంధాలయాన్ని ఏర్పాటు చెయ్యడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (TANTEX) 2012 అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి గీత దమ్మన గారు, పుష్పగుచ్ఛం ఇచ్చి ముఖ్య అతిధిని ఆహ్వానించారు. శ్రీమతి గీత దమ్మన గారు ప్రసంగిస్తూఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కార్యక్రమాలన్నింటిలో సాహిత్య వేదిక ప్రత్యేకత ను వివరిస్తూ దానిని విజయవంతంగా నడిపిస్తున్న కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు అందచేసారు.

tantex nelanela telugu vennela, dollas nelanela telugu vennela, tantex dollas sankranthi sambaralu, tantex nelanela telugu vennela 52 celebration

 

"అమెరికాలో మన తెలుగు రచనలు వలసిన వస్తువు, భాష, శైలి , సరంజామా " అనే అంశం మీద ప్రసంగించిన శ్రీ సురేష్ కాజా గారు, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అందచేసి ప్రముఖ కవులు, పండితులు ముఖ్య అతిధులుగా విచ్చేసిన ఈ సభకు ముఖ్య అతిధిగా రావడం చాలా గర్వకారణంగా ఉందన్నారు. తన ప్రసంగంలో కవితలు, పద్యాలు, వ్యాసాలతో పాటు ప్రస్తుతం విరివిగా పుట్టుకొస్తున్న బ్లాగులు, facebook పోస్టులు కూడా రచనలలో భాగం గానే పరిగణించాలన్నారు. ముఖ్యంగా అమెరికాలో వెల్లి విరుస్తున్న తెలుగు సాహిత్యంలో వాడుతున్న వస్తువు ఇంకా ఆంధ్రప్రదేశ్ తో ముడి పడి, అక్కడి గ్రామీణ సంస్కృతీ, రాజకీయాలు, సినిమాలు, ఆకలి బాధల మీద ఉండడం కొంచెం అశ్యర్యకరంగా ఉందని ఒక వైపు ఆంధ్ర మూలాలతో అమెరికా జీవన స్రవంతిలో భాగమైన ప్రవాసుల ప్రవాసం జోడెడ్ల మీద ప్రయాణంలా ఉందని, ఈ రచనా వస్తువు సేకరణలో, మనం స్తానికంగా ఉన్న పరిస్తుతుల మీద, ఇక్కడి పిల్లల పెంపకం మీద వాళ్ళ వాళ్ళ ఇష్ట ఇష్టాల మీద, ఇక్కడి సాంఘిక పరిస్థితుల మీద మంచి మంచి రచనలు చెయ్యొచ్చని గుర్తు చేసారు.

 

భాష, శైలి మీద ప్రసంగిస్తూ భాష అనేది ఒక జీవనదిలా ఉండాలని, పరభాషా పదాలతో కొత్త కొత్త నుడికారాలతో కాలానికి అనుగుణంగా రూపాంతరం చెందాలని అప్పుడే ఏ భాషైనా ముందు తరాల వారికి అందుబాటులో ఉంటుందని అలాగే రచనలలో తెలుగు భాషలో ఉన్న మాండలికాలకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలని పత్రికా భాషా వ్యామోహంలో మాండలికాలు మరుగున పడి పోతున్నాయని తెలియ చేసారు. తెలుగు భాషను బ్రతికించాలి, తెలుగు భాషకు అన్యాయం జరుగుతుంది అనే అపోహలుతో భాషను దాని పదాలను కట్టడి చెయ్యకూడదని అవసరానికి తగినట్లుగా కొత్త పదాలను చేర్చాలని, అలాగే 21 వ శతాబ్దంలో వెల్లి విరిసిన సాంకేతిక విప్లవం ద్వారా తెలుగు భాష బాగా వ్యాప్తి చెందిందని కోకొల్లలుగా పుట్టుకొస్తున్న బ్లాగులు, వ్యాసాలు అందుకు నిదర్శనమని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అమెరికా తెలుగు రచనలు అన్న అంశంలో ఒక భాగమైన సరంజామా గురించి మాట్లాడుతూ తెలుగులో టైపించడం, ఐఫోన్ మరియు ఐపాడ్ లను ఉపయోగించడం ద్వారా మనం తెలుగును విరివిగా ఉపయోగించవచ్చని స్వయంగా ఆ పరికరాలతో తన ప్రసంగాన్ని నిర్వహించడం సాహితీ ప్రియులందరినీ ఆకట్టుకుంది. ప్రసంగంలో భాగంగా వివిధ అంశాల మీదసభికులు కూడా తమ అభిప్రాయాలను తెలియజేసి కార్యక్రమం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది.

tantex nelanela telugu vennela, dollas nelanela telugu vennela, tantex dollas sankranthi sambaralu, tantex nelanela telugu vennela 52 celebration

 

చివరగా ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన గారు మరియు పాలక మండలి ఉపాధిపతి శ్రీ సి. ఆర్. రావు గారు ముఖ్య అతిధిని దుశ్శాలువతో సత్కరించారు. సాహిత్య వేదిక కార్య వర్గ సభ్యులు ముఖ్య అతిధి శ్రీ సురేష్ కాజా గారికి జ్జ్ఞాపికను అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం కోశాధికారి శ్రీ కృష్ణా రెడ్డి ఉప్పలపాటి మరియు సభ్యత్వ కార్యదర్శి శ్రీ చిన్న సత్యం కూడా హాజరయ్యారు.

 

 

TeluguOne For Your Business
About TeluguOne
;