RELATED EVENTS
EVENTS
డల్లాస్ లో వైభవంగా టాంటెక్స్ ఉగాది ఉత్సవాలు

 

 

 

 

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారు, స్థానిక యూలెస్ లోని ట్రినిటి హైస్కూల్లో ఉగాది ఉత్సవాలని అత్యంత వైభవంగా నిర్వహించారు. సంస్థ అధ్యక్షులు సురేష్ మండువ మరియు కార్యక్రమ సమన్వయ కర్త కృష్ణారెడ్డి ఉప్పలపాటి అధ్వర్యంలో సాంస్కృతిక కార్యదర్శి కృష్ణవేణి శీలం ఈ కార్యక్రమాలని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుమతి వైశ్యరాజు , జస్మిత తుమ్మల వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ప్యారడైజ్ బిర్యానీ పాయింట్ రెస్టారెంట్ వారు ఉగాది పచ్చడితో కూడిన రుచికరమైన విందు భోజనాన్ని వడ్డించారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది బాల బాలికలు ఉత్సాహంగా పాల్గొని వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చారు. సుమారు 1000 మంది తెలుగువారు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి భారతదేశం నుండి ప్రముఖ హాస్య నటి శ్రీ లక్ష్మి , బుల్లి తెర మెగా స్టార్ మరియు నృత్య కళాకారుడు "రంగం" ఇంద్రనీల్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

 

 

 

సాంస్కృతిక కార్యదర్శి కృష్ణవేణి శీలం స్వాగతోపన్యాసంతో కార్యక్రమ శుభారంభం జరిగింది. మౌతికి రెడ్డి వీణ మీద అమెరికన్ జాతీయ గీతాన్ని పలికించారు. శ్రీ విజయనామ సంవత్సర విశేషాలను వివరిస్తూ కామేశ్వర శర్మ గారు పంచాంగ శ్రవణం గావించారు. విజి సోమనాథ్ శిష్యుల అన్నమా చార్య కీర్తనలు, జ్యోతి కందిమళ్ళ వినాయకౌతం , శ్రీలు మందిగ " తుమ్మేదాలున్నయెమిరా " జానపద నృత్యం, సునీత మితకంటి మూవీ డాన్సు , శ్వేతా వాసల్ డాన్సు మెడ్లీ, స్వప్నా గుడిమెల్ల కృష్ణ లీలలు శాస్త్రీయ నృత్యం, శ్రీలత సూరి శిష్య బృందం చేసిన "దశావతార" ఉగాది కూచిపూడి నృత్యం, దీప్తి బెండపూడి "కొత్త పాతల కలయిక",అనిత దండ, స్వప్న కూతురు కొరియోగ్రఫీ చేసిన డల్లాస్ రైసింగ్ స్టార్స్ తెలుగు డాన్సు మెడ్లీ శ్రోతలను ఆకట్టుకున్నాయి . తదుపరి నృత్య కళాకారుడు "రంగం" ఇంద్రనీల్ చేసిన శాస్త్రీయ నృత్యం విశేషంగా ఆకట్టుకొంది.

 అధ్యక్షులు సురేష్ మండువ గారు శ్రీ విజయనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియచేస్తూ తమ అధ్యక్ష సందేశంలో సంస్థ అభివృద్దికి తోడ్పాటు నందిస్తున్న పోషక దాతలకు, కార్యవర్గానికి, సభ్యులకు కృతఙ్ఞతలు తెలియ చేశారు. విజయ నామ సంవత్సరాన్ని తెలుగు భాషాభ్యుదయ సంవత్సరముగా ప్రకటించారు. ఈ సందర్భముగా సాహిత్యం,వైద్య, విద్యా రంగాలలో విశేష సేవలందించిన వ్యక్తులకు టాంటెక్స్ ఉగాది పురస్కారాలను ప్రకటించారు. సాహిత్య రంగంలో ఆచార్య వెల్చేరు నారాయణ రావు గారికి, వైద్య రంగంలో పద్మశ్రీ డా. వెంకట్ రామ్ గారికి, విద్యా రంగంలో డా.కె. ఆర్ . రావ్ గారికి ఈ పురస్కారాలను అందచేశారు. రాబోయే నెలల లో తానా మరియు నాట్స్ సంబరాలు డల్లాస్ లో నిర్వహించబడుతున్న సందర్భముగా టాంటెక్స్ సహ ఆతిధ్యం అందించడం ఎంతో గర్వకారణమని, ఈ కార్యక్రమాలకి వచ్చి విజయ వంతం చేయవలసిందిగా ఆహ్వానించారు. తానా అధ్యక్షులు శ్రీ ప్రసాద్ తోటకూర ప్రసంగిస్తూ డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే తాన ఉత్సవాలకు టాంటెక్స్ సభ్యులందరినీ ఆహ్వానించారు.ప్రముఖ హాస్య నటి శ్రీ లక్ష్మి ప్రదర్శించిన హాస్య సన్నివేశాలు శ్రోతలను కడుపుబ్బా నవ్వించాయి. తదుపరి నటి శ్రీలక్ష్మి ని టాంటెక్స్ మహిళా పూర్వాధ్యక్షులు, మహిళా కార్యవర్గ సభ్యులు మరియు వివిధ జాతీయ తెలుగు సంస్థల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.నాట్స్ సంస్థ తరపున ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే సంబరాలకు , సంబరాల సమన్వయకర్త శ్రీనివాస్ కోనేరు,మరియు సహ సమన్వయ కర్త విజయ్ వెలమూరి అందరిని ఆహ్వానించారు. తదుపరి మల్లిక్ దివాకర్ల బృందం ప్రదర్శించిన "ఉగాది పచ్చళ్ళు - పతుల పాట్లు" నాటిక అందరిని అలరించింది. తదుపరి టాంటెక్స్ రేడియో కార్యక్రమం “గాన సుధ” మరియు తరంగిణి రేడియో వ్యాఖ్యాతలను రేడియో కమిటీ చైర్ విజయ్ కాకర్ల వేదికపైకి ఆహ్వానించి అభినందించారు. ఎక్కువ కార్యక్రమాలను అందించిన రేడియో వాఖ్యాతలు జయ కళ్యాణి పెనుమర్తి, ఇందిరా మేడూరి మరియు గోపినాథ్ పేటూరి లను జ్ణాపికలతో సత్కరించారు. సాంస్కృతిక కార్యదర్శి జ్యోతి వనం కల్చరల్ కమిటీ సభ్యులను సభకి పరిచయం చేశారు. ఉగాది పచ్చడి పోటీలలో, సంప్రదాయ వస్త్ర ధారణ పోటీలలో విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ సందర్భముగా స్థానిక కాలమాన పరిస్థితులతో తయారుచేసిన అచ్చమైన తెలుగు క్యాలెండర్ ని సభ్యులకు అందచేశారు.రూప బండ "లాల గూడ లంబడి పిల్ల" జానపద నృత్యం, కవితా విక్టర్ తెలుగు డాన్సు మెడ్లీ, రంజిత ఆర్య సినిమా నృత్యాలతో,  ఇంద్రనీల్ జాలరి మరియు సినిమా నృత్యాలతో కార్యక్రమం హుషారుగా ముగిసింది. కార్యక్రమ సమన్వయ కర్త కృష్ణారెడ్డి ఉప్పలపాటి పోషక పోషక దాతలైన మయూరి ఇండియన్ రెస్టారెంట్, మై టాక్స్ ఫైలర్, బావార్చి బిర్యానిపాయింట్, డిస్కవర్ ట్రావెల్,  హోరైజాన్ ట్రావెల్స్, ప్యారడైజ్ బిర్యాని పాయింట్, పసంద్ రెస్టారెంట్, సౌత్ ఫోర్క్ డెంటల్, యూనికాన్ ట్రావెల్స్, ఈవెంట్ స్పాన్సర్ అరవింద్ రెడ్డి మరియు మాధవి ముప్పిడి గారికి , అడాలి సాఫ్ట్, డేవిడ్ వీక్లీ హోమ్స్ , దేసిప్లాజా, ఏక్ నజర్ , టివి 9, టివి 5, టోరి , రేడియో కుషి, మై డీల్స్ హబ్ మీడియా వారికి , అందరు కార్యకర్తలకు కృతఙ్ఞతలు తెలియచేసారు.

 

TeluguOne For Your Business
About TeluguOne
;