ఆసీస్ సూపర్ -8 అర్హతకు జింబాబ్వే గండం

Publish Date:Feb 17, 2026

Advertisement

టీ 20 వరల్డ్ కప్‌ టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియా ఇప్పుడు కనీసం సూపర్-8లో అడుగుపెట్టడం ప్రశ్నార్ధకంగా మారింది. గ్రూపు మ్యాచుల్లో ఇప్పటి వరకు ఆడిన 3 మ్యాచుల్లో కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచిన ఆసీస్ తన చివరి పోరుతో ఒమన్ తో ఈ నెల 20న తలపడనుంది. ఆ పసికూనపై గెలిచినా సూపర్-8కి అర్హత సాధిస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. ఇప్పటకే జింబాబ్వే రెండు విజయాలు సాధించి ఆసీస్ కంటే పాయింట్ల పట్టికలో ముందుంది. ఆఖరి రెండు మ్యాచుల్లో జింబాబ్వే ఒక్క విజయం నమోదు చేసినా సూపర్-8 దశకు చేరుతుంది. అదే జరిగితే  ఆసీస్ ఆశలకు గండి పడటం ఖాయం

సోమవారం (ఫిబ్రవరి 16) శ్రీలంకతో జరిగిన జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ పరాజయం పాలైంది. ఆసీస్ పై శ్రీలంక  8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సూపర్-8కు దూసుకెళ్లింది. ఆ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 181 పరుగులు ఆలౌటైంది. శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 18 ఓవర్లలోనే 184 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిశాంక  52 బంతుల్లో 10 ఫోర్లు,  5 సిక్స్‌లతో  100 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ఈ టోర్నీలో తొలి సెంచరీ నమోదు చేసిన బ్యాటర్ గా ఘనత సాధించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.