ఏపీలో జీరో కరోనా.. జగనన్న చేసింది కూడా జీరోనేనా!?
Publish Date:Apr 26, 2022
Advertisement
ఏపీలో వండర్ జరిగింది. సోమవారం ఒక్కటంటే ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. రెండేళ్ల తర్వాత రాష్ట్రం జీరో కరోనా కేస్ డే గా నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు లేవని కావు. ఉన్నాయి కానీ, సోమవారం మాత్రం కొత్తగా ఒక్కటంటే ఒక్క కేసు కూడా రాకపోవడం విశేషం. ఏపీలో ప్రస్తుతం 22 యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం రాష్ట్రంలో ఒక్క కొవిడ్ కేసు కూడా నమోదు కాలేదు. ఏపీలో కరోనా విలయం మొదలైన తర్వాత జీరో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. 2020 మార్చి 9న ఏపీలో తొలి కేసు నమోదైంది. కానీ ఆరోగ్యశాఖ అధికారులు మార్చి 12న నమోదైనట్టు చూపించారు. అప్పటి నుంచి ప్రతి దశలోనూ అత్యధికంగా నమోదవుతూనే ఉన్నాయి. ఓ దశలో ఒక్కరోజులోనే 24 వేల కేసులు కూడా వచ్చాయి. కానీ.. ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులోకి వచ్చింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,163 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదని వైద్యఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 23,19,662 మంది కరోనా బారినపడ్డారు. సోమవారం 12 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కరోనా కట్టడికి జగన్ సర్కారు పెద్దగా చేసిందేమీ లేదనే విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రుల్లో సరైన చికిత్స అందక.. బాధితులు తెలంగాణకు వలస కట్టడం చూశాం. మందుల కొరత, ఆక్సిజన్ సిలిండర్ల కొరత, బెడ్స్ కొరత.. ఇలా రెండేళ్లు ప్రజలను వాళ్ల మానాన వారిని వదిలేశారే కానీ.. ప్రభుత్వం తరఫున కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకుంది లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొవిడ్ చికిత్సకు వచ్చిన బాధితుల కుటుంబ సభ్యులపై అఘాయిత్యాలు, వ్యభి-చార కూపంలోకి నెట్టిన ఘటనలూ జరగడం మరింత దారుణం. బ్లీచింగ్ పౌడర్ చల్లడం మినహా వైసీపీ సర్కారు ప్రజలపై శ్రద్ధ పెట్టింది లేదని అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వ ఉచిత వ్యాక్సినేషన్ సక్సెస్ కావడం.. కరోనా వేవ్ ఖతం కావడంతో.. తాజాగా సున్నా కేసులతో ఆంధ్రప్రదేశ్ ఊపిరి పీల్చుకుంది.
http://www.teluguone.com/news/content/zero-corona-cases-in-ap-25-134993.html





