Publish Date:Feb 10, 2020
ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తోంది. కరోనా కల్లోలంతో చైనా అల్లకల్లోలమవుతోంది. కరోనా కారణంగా ఇప్పటికే ఏడెనిమిది వందల మంది మరణించగా, వేలాది మంది వైరస్ బారినపడ్డారు. అయితే, ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది. ఒక్కటి వైరస్ కాదు... రెండు వైరస్ లు గడగడలాడిస్తున్నాయి. ఈ వైరస్ లు జనాన్ని కంటే ఎక్కువగా రాజకీయ పార్టీలను వణికిస్తున్నాయి. ఇంతకీ ఈ వైరస్ లను కనిపెట్టింది... సృష్టించింది కూడా పొలిటికల్ పార్టీలే. అంతేకాదు, ఈ వైరస్ లు కరోనా కంటే డేంజర్ అంటున్నాయి. అధికార వైసీపీ.... ఎల్లో వైరస్ ను కనిపెడితే... ప్రతిపక్ష నేత చంద్రబాబు... వైసీపీ వైరస్ ను సృష్టించారు. ఇంతకీ ఈ వైరస్ లు ఏంటో ఇఫ్పటికే మీకు అర్ధమై ఉంటుంది. అదేనండీ పొలిటికల్ వైరస్ లు. కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంటే... ఈ వైసీపీ వైరస్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టిపీడిస్తోందని జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు చంద్రబాబు.
కరోనా... చైనాను అతలాకుతలం చేస్తుంటే.... దానిని మించిన వైసీపీ వైరస్ ఎనిమిది నెలలుగా ఏపీని చెల్లాచెదురు చేస్తోందని బాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వైరస్ పేరెత్తితేనే పెట్టుబడిదారులు భయపడి పారిపోతున్నారని విమర్శలు గుప్పించారు. వైసీపీ వైరస్ దెబ్బకు కంపెనీలన్నీ ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోతున్నాయని అన్నారు. ఏడెనిమిది నెలలుగా వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తుందని మండిపడ్డారు.
అయితే, చంద్రబాబు విమర్శలకు వైసీపీ నేతలు రివర్స్ కౌంటరిస్తున్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కన్నా ఎల్లో వైరస్ మరింత ప్రమాదకరమని సెటైర్లు వేస్తున్నారు. చైనాలో కరోనా కల్లోలం సృష్టిస్తుంటే... ఆంధ్రప్రదేశ్ ను ఎల్లో వైరస్ పట్టి పీడిస్తోందని ఎద్దేవా చేశారు. ప్రపంచానికి కరోనా వైరస్ పడితే, ఏపీకి చంద్రబాబు వైరస్ వేధిస్తుందని విమర్శిస్తున్నారు. మొత్తానికి, ఏపీలో కొత్త వైరస్ లను సృష్టించిన టీడీపీ, వైసీపీలు... కరోనా పేరుతో కొత్త తరహాలో వైరస్ యుద్ధం చేసుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కొత్త వైరస్... మీరు కారణమంటే మీరు కారణమంటూ బాబు, జగన్ ఆరోపణలు...
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysrcp-virus-dangerous-than-corona-disperses-ap-for-8-months-25-94030.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.