నవరత్న పథకాల అమలు విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్న వైసిపి ప్రభుత్వం...

Publish Date:Feb 8, 2020

Advertisement

నవరత్న పథకాల అమలు విషయంలో వైసిపి ప్రభుత్వం పక్కా ప్రణాళికతో వెళుతోంది. మిగిలిన అంశాల్లో కాస్త కూస్తో తేడాలు జరిగినా చూసీ చూడనట్టుగా ఉంటుందేమో కానీ నవరత్నాలపై చాలా సీరియస్ గా ఉంది. ఇంటింటికీ పెన్షన్ లను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గతానికి భిన్నంగా అత్యంత త్వరగా పారదర్శకంగా పెన్షన్ లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయించుకుంది దీనికి అనుగుణంగానే గ్రామ వాలెంటీర్ లు, గ్రామ సచివాలయం సెక్రెటరీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజునే తొంభై శాతం మేర పెన్షన్ లను పంపిణీ పూర్తి చేసింది ప్రభుత్వం. గతంలో ఇవే పెన్షన్ లను పంపిణీ చేయాలంటే కనీసం వారం రోజులు పట్టేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇంటింటికీ పెన్షన్ లను అమలు చేసే విషయంలో లబ్ధిదారుల నుంచి ప్రభుత్వానికి మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీంతో పెన్షన్ ల పథకం అమలులో మరిన్ని వెసులుబాట్లు కల్పించడం ద్వారా మరింత మెరుగైన సేవలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీంట్లో భాగంగా పెన్షన్ ల జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుతం రాష్ట్ర ఖజానా నుంచి ఆయా మండలాల ఎంపిడీవోల బ్యాంకు ఖాతాలకు ఆ మండలానికి సంబంధించిన నిధులు వెళతాయి. అక్కడ నుంచి ఆ మండల పరిధి లోని గ్రామ సచివాలయాల సెక్రెటరీ కన్వీనర్ కు పెన్షన్ ల మొత్తాన్ని అందజేయడం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్ లు జారీ ప్రక్రియ చేపడతారు. 

ఇప్పుడు దీనికి చిన్నపాటి సవరణ చేపట్టే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఖజానా నుంచి ఆయా మండలాల ఎంపీడీవో లకు కాకుండా నేరుగా గ్రామ సచివాలయం సెక్రెటరీ కన్వీనర్ల ఖాతాలకు సదరు గ్రామానికి చెందిన పెన్షనర్ ల నిధులను పంపి జారీ ప్రక్రియను మరింత సులభతరం చేసే దిశగా ఆలోచన చేస్తున్నారు. దీని ద్వారా గ్రామాల నుంచి సదరు గ్రామ సచివాలయం సెక్రెటేరియట్ కన్వీనర్ కు మండల కేంద్రానికి వెళ్లే బాధ తప్పుతుంది అనేది సర్కారు పెద్దల వద్దకు వచ్చిన ప్రతిపాదన. మరో వైపు పెన్షన్ లను మరింత మందికి అందించేలా చర్యలు ప్రారంభించింది సర్కార్. గతంలో ఉన్న పెన్షన్ లతో పోల్చుకుంటే ప్రస్తుతం పెన్షన్ లు భారీ స్థాయిలో కోతలు విధించినట్టు విమర్శలు వస్తుండటంతో వీలైనంత మందిని పెన్షన్ ల అర్హుల జాబితాలో చేర్చేందుకు కసరత్తు ప్రారంభించింది. గతంతో పోల్చుకుంటే సుమారు రెండు లక్షలకు పైగా లబ్ధిదారులకు అదనంగా పెన్షన్ లు జారీ చేస్తున్నా, ఇంతకు ముందున్న జాబితాలో ఉన్నవారిలో నాలుగు లక్షల పదహారు వేల ముప్పై నాలుగు మందిని అనర్హులుగా ప్రకటించారు. అయితే ఈ అనర్హుల జాబితాను పునహ్  పరిశీలించడం ద్వారా మరింత మందికి పెన్షన్ సౌకర్యం కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. అలాగే మూడు వందల యూనిట్ల మేర విద్యుత్ ను వినియోగించుకోవటంతో సుమారు ఎనిమిది వేల తొమ్మిది వందల మంది అర్హత కోల్పోయారు. ఈ జాబితాను కూడా పరిశీలించడం ద్వారా ఇంకొంతమందికి పెన్షన్ సౌకర్యం కల్పించాలి అనేది సర్కారు సంకల్పం. నవరత్నాల పథకాల అమలు విషయంలో మరీ ముఖ్యంగా పెన్షన్ లు, అమ్మఒడి వంటి పథకాల్లో ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తెప్పించుకోవడం, దానికనుగుణంగా అమలులో అవసరమైన మేరకు మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది నిరంతర ప్రక్రియగా పెట్టుకోవాలనే భావన ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది.

By
en-us Political News

  
జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
గత ఎన్నికలకు ముందు వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేసిన వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు ఎట్ లీస్ట్ 11 అనాల్సిన పరిస్థితి వచ్చేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రాకపోవడం, ప్రజాసమస్యలను పట్టించుకోకపోవడం, అన్నిటికీ మించి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం వంటి అంశాలు పార్టీని జనాలను దూరం చేస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఏమాట‌కామాట నాదెండ్ల‌, ల‌క్ష్మీపార్వ‌తి ఎన్టీఆర్ జీవితాన్ని మ‌లుపు తిప్పిన వారే.
కార‌ణం విజ‌య్ టీవీకే పార్టీ పెట్టి ఆ పార్టీని ప్ర‌స్తుతం ఎన్నిక‌ల ప‌రీక్ష‌కు నిల‌ప‌డంతో.. ఇతర న‌టుల పార్టీలు, అవి తొలి సారి ఎన్నిక‌ల్లో పాల్గొన్న‌పుడు సాధించిన ఓట్ల శాతం ఎంత‌? అన్న ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర‌లేచింది.
ప‌సుపు ఒక మ‌హిళ‌కు ఎంత ముఖ్య‌మో తెలిసిందే. ఆపై నీలం అంటే ద‌ళిత సందేశం ఇస్తుంది. ఇక పోతే ఆకుప‌చ్చ అంటే అది భార‌త జెండాలో ఒక భాగం. ముస్లీం మైనార్టీల‌ను ఏకం చేసేది. కాబ‌ట్టి క‌విత జెండా రంగుల్లో ఇవి ప్ర‌ముఖంగా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. దీంతో క‌విత ప్ర‌క‌టించ‌బోయే పార్టీ జెండా రంగులు, గుర్తు ఆల్రెడీ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నారు.
బెంగాల్ ఎన్నికల చరిత్రను పరిశీలిస్తే, ఓటింగ్ శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 1969లో కేవలం 70 శాతంగా ఉన్న ఓటింగ్, 1987 నాటికి 78 శాతానికి చేరింది. ఆ తర్వాత 1996లో 80 శాతం, 2011లో 84 శాతంగా నమోదైంది. గత 2021 ఎన్నికల్లో 82 శాతానికి పరిమితమైన ఓటింగ్.. ఇప్పుడు 2026లో ఏకంగా 92 శాతాన్ని దాటి సరికొత్త రికార్డును సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు జగిత్యాల వేదికగా జరిగిన సభ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ చరిత్రను పరిశీలిస్తే నాదెండ్ల భాస్కరరావుకు, చంద్రబాబు నాయుడుకు మధ్య సుదీర్ఘమైన రాజకీయ వైరం ఉంది. 1984లో ఎన్టీఆర్ అమెరికా వెళ్లిన సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలు, ఆపై నాదెండ్ల ముఖ్యమంత్రి కావడం వంటి సంఘటనలు తెలుగు రాజకీయాల్లో ఒక కీలక మలుపు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను తిరిగి అధికారంలోకి తీసుకురావడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు.
న్టీఆర్ అమెరికాలో గుండె ఆపరేషన్ చేయించుకుని తిరిగి వచ్చేలోపు, నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. ఆ క్లిష్ట సమయంలో తెలుగుదేశం పార్టీ చెల్లాచెదురు కాకుండా, ఎమ్మెల్యేలను ఏకం చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీని కాపాడిన రక్షకుడి ఇమేజ్ ఆయనకు అప్పుడే వచ్చింది.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు ఉదయనిథి స్టాలిన్, టీవీకే అధినేత విజయ్, బీజేపీ నాయకురాలు ఖుష్బు, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
విజయ్ రాజకీయాల్లోకి రావడాన్ని చంద్రబాబు స్వాగతిస్తూనే.. ప్రజా సేవ చేయాలనే తపనతో రాజకీయాల్లోకి వచ్చే ఎవరినైనా ఆహ్వానించాల్సిందేనన్నారు. అయితే సినిమాల్లో ఉన్న ఇమేజ్ రాజకీయాల్లో రాణించడానికి సరిపోదనీ, రాజకీయాలలో పట్టుదల, సహనం చాలా ముఖ్యమన్న చంద్రబాబు.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు.
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వైసీపీ పరిస్థితిని గమనిస్తే నేతల మధ్య సఖ్యత లేదన్న విషయం ప్రస్ఫుటంగా తెలుస్తుంది. పార్టీలో కీలక నేతలు ఉన్నప్పటికీ, వారంతా సమష్టిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న చంద్రంగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీ కేడర్‌ అయోమయంలో పడింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జ్‌గా కన్నబాబు నియామకం తరువాత స్థానిక నేతల నుంచి ఆయనకు ఏ మాత్రం సహకారం అందడం లేదు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.