కడప వీధుల్లో షర్మిల వర్సెస్ భారతి

Publish Date:Apr 29, 2024

Advertisement

వైసీపీకి కంచుకోట అయిన కడపలో ఆ పార్టీ ఆధిపత్యానికి బీటలు వారుతున్నాయా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. వాస్తవానికి కడప జిల్లా వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఆ జిల్లాలో ఇప్పటి వరకూ ఆ కుటుంబానికి ఎదురన్నదే లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఆ కుటుంబానికి జిల్లాపై అలాంటి సాధికారత లేకుండా పోయింది. అందుకు ప్రధాన కారణం ఇప్పుడా కుటుంబం నిట్టనిలువుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పరస్పరం పోటీ పడటమే. ఔను కడప జిల్లాలో ఇప్పుడు వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయి ఆధిపత్యం కోసం పోరాడుతోంది. 

గత ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలోకి రావడం కోసం, జగన్ ముఖ్యమంత్రి కావడం కోసం కుటుంబం మొత్తం ఐక్యంగా నిలబడింది. జిల్లాలో ఫలితాలు అందుకు తగ్గట్టుగానే వచ్చాయి. అయితే ఐదేళ్లు గిర్రున తిరిగే సరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఐదేళ్ల కిందట జరిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులు వైఎస్ కుటుంబీకులే కావడం, ఆ అంశంపైనే కుటుంబం రెండుగా చీలిపోవడంతో జిల్లాలో పరిస్థితి తారుమారైంది. 

జగన్ అధకారంలోకి వచ్చిన తరువాత చెల్లెలు షర్మిల అన్నతో విభేదించింది. న్యాయంగా తనకు రావలసిన కుటుంబ ఆస్తులను ఇవ్వకపోవడమే కాకుండా పార్టీలో తన ప్రాధాన్యతను పూర్తిగా తగ్గించి, చవరకు పార్టీ నుంచే సాగనంపిన జగన్ కు వ్యతిరేకంగా ఆమె గళమెత్తారు. అలాగే వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను జగన్ వెనకేసుకు వస్తున్నారని ఆరోపిస్తూ, వివేకా కుమార్తె డాక్టర్ సునీత చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించి, ఆమెకు బాసటగా నిలిచారు. 

ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ స్థానం నుంచి పోటీలో ఉంటే.. వైఎస్ షర్మిల అదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రంగంలో నిలిచారు. ఇక ఇదే లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అధినేత, సీఎం జగన్ పోటీ చేస్తున్నారు.  

తన భర్తకు మద్దతుగా  వైఎస్ భారతి పులివెందులలో ప్రచారం చేస్తున్నారు. కడప లోక్ సభ అభ్యర్థిగా రంగంలో ఉన్న షర్మిల ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. నేరుగా జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో కడప వీధుల్లో వైఎస్ భారతి, వైఎస్ షర్మిల రాజకీయ పోరాటం రాష్ట్ర రాజకీయాల్లోనే హైలైట్ గా నిలవనుంది.  ఇప్పటి  వరకూ అయితే వైఎస్ భారతి వ్యూహాత్మకంగా  షర్మిలపై నేరుగా ఎటువంటి విమర్శలూ చేయకుండా ప్రచారం కొనసాగిస్తున్నారు. అయితే షర్మిల మాత్రం  భారతిపై నేరుగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వైఎస్ భారతి కూడా షర్మిలపై డైరెక్టుగా విమర్శలు సంధించడానికి ఎక్కవ రోజులు తీసుకునే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. దీంతో తొలిసారిగా వైఎస్ కుటుంబ కోటకు బీటలువారిన సంకేతాలు కనిపిస్తున్నాయి. కడప ఫలితమే నిజమైన వైఎస్ రాజకీయవారసులెవరన్నది తేలుస్తుందని చెబుతున్నారు. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
రాజకీయంగా ఎదుర్కొనలేకే.. దర్యాప్తు సంస్థల ద్వారా తమ విజయాన్ని అడ్డుకోవాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రయత్నిస్తున్నదని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా నియంత్రణ శిక్షా? బహుమతా? అని నిల‌దీస్తున్నారు సీఎం రేవంత్. కేంద్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన ఎంపీ సీట్లను పెంచాలని చూస్తోంది. ఆనాడు కేంద్రం పిలుపునిచ్చిందని దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయి. ఫలితంగా ఇక్కడ జనాభా పెరగలేదు.
ఈ కేసులన్నీ ప్రజలకు టికెట్ లేని సినిమా చూపిస్తున్నాయన్నారు. ఈ కేసుల్లో ఎవరికి శిక్షలు పడవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.