Publish Date:May 16, 2022
జగన్ ఆర్భాటంగా ప్రచారం చేసుకుని, ఆడంబరంగా ప్రారంభించిన పథకాలు ఒకదాని వెనుక ఒకటిగా నీరుగారిపోతున్నాయి. తల్లి దీవెన, అమ్మఒడి, రైతు భరోసా ఇలా ఒక్కటొక్కటిగా పథకాలను నిలిపివేయడమో, వాయిదా వేయడమో షరతులతో లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత వేయడమో చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు ఆ కోవలోకి వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కూడా చేరిపోయింది. మాటలు కోటలు దాటాయి కానీ చేతలు గడప దాటలేదన్నట్లు.. పేద వారి వైద్యం కోసం ప్రభుత్వం ఎంతటి వ్యయానికైనా వెనుకాడదు.. వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన ప్రతి చికిత్సనూ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ పథకం కిందకు తీసుకువస్తానంటూ ఘనంగా ఎన్నికల సందర్భంగా చేసిన వాగ్దానం ఇప్పుడు గాలి మూటగా మారిపోయింది. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులకు బకాయిలు పేరుకు పోవడంతో ఆ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను బంద్ చేసేశారు.
ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల బకాయిలు 600 కోట్లకు పైగా పేరుకుపోవడంతో ఇక ఈ సేవలు అందించలేమంటూ ఆస్పత్రులు చేతులెత్తేశాయి. నాలుగు నెలలుగా ఆరోగ్య శ్రీ బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. ఒక్కో నెట్ వర్క్ ఆస్పత్రికి ప్రభుత్వం కోట్ల రూపాయలు బకాయి పడింది. ప్రభుత్వం ఈ సేవల కోసం ఒక్క టంటే ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు.
అసలు ఎప్పటికైనా చెల్లిస్తారా? చెల్లించేటట్లయితే ఎప్పటికి చెల్లిస్తారు అన్న ప్రశ్నలకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ వద్ద కానీ, సర్కార్ వద్ద కానీ సమాధానం లేదు. ఆస్పత్రులకు బకాయిలే పేరుకుపోవడంతో అవి ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేశాయి. వచ్చిన రోగులకు నిర్మొహమాటంగా సొమ్ము చెల్లిస్తేనే వైద్యం.. ఆరోగ్య శ్రీ కింద అయితే వైద్యం చేయం అని తేల్చి చెప్పేస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ysr-arogya-sri-servieces-stopped-in-ap-25-135947.html
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.