వివేకా కొత్త భార్య ఎంట్రీ

Publish Date:Apr 21, 2023

Advertisement

వివేకానందరెడ్డి రెండు సార్లు పెళ్లి చేసుకున్న రెండవ భార్య  షేక్ షమీమ్  తెరముందుకు వచ్చింది. వివేకా హత్య జరిగిన నాలుగేళ్ల తరువాత షమీమ్ ఎంట్రీ అవినాష్ వర్గానికి కొత్త ఊపును తెచ్చింది. నాలుగేళ్లుగా కడప నగరంలోని ప్రకాష్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా జీవిస్తున్న షమీమ్ ను  హైదరాబాద్ కు తీసుకువచ్చి, సీబీఐ ముందుకు వెళ్లేందుకు శిక్షణ ఎవరిచ్చారో తెలుసుకునేందుకు పెద్ద తెలివితేటలు అవసరం లేదు.

ఆ విషయాలను పక్కన పెడితే.. షమీమ్ సీబీఐకి ఇచ్చిన స్టేట్ మెంట్ లో అనేక ఆసక్తికర అంశాలు చోటు చేసుకున్నాయి. తనను తన భర్త వివేకానందరెడ్డితో కలవకుండా సునీత, శివప్రకాశ్ రెడ్డిలు అడ్డుకున్నారని ఆమె ఆరోపించారు. వివేకాతో పెళ్లి తన ఇష్టానికి వ్యతిరేకంగా జరిగిందన్న షమీమ్ , ఈ వివాహానికి తన అనుమతి లేదని తేల్చేశారు. తన వివాహం 2010లో జరుగగా, 2015లో కొడుకు షెహన్ షా కలిగాడని ఆమె చెబుతోంది. అయితే వివేకాతో జరిగిన తన వివాహానికి ఎటువంటి సాక్ష్యాన్ని ఆమె అందించ లేదు.  2019లో హత్యకు గురైన వివాకా అప్పటికి నాలుగేళ్లు కూడా లేని ఆమె కుమారుడిని తన రాజకీయ వారసుడిగా ప్రకటించారని షమీమ్ చెబుతోంది. భూ సెటిల్మెంట్ లో తనకు ఎనిమిది కోట్లు వస్తాయన్న ఆశతో ఎదురు చూసినట్లు షమీమ్ చెప్పుకుంది.

తనకు డబ్బు, తన కుమారుడికి రాజకీయ వారసత్వం రావాలని షమీమ్ కోరుకుంది. కానీ అలా జరగకపోవడంతో నాలుగేళ్లుగా ఆలోచించి ఇప్పడు సీబీఐ ముందు తన గోడు వెళ్లబోసుకుంది. . నిన్నటి వరకూ వివేకా రాసిన వీలునామా చుట్టూ సాగిన చర్చ ఈ రోజు ఎక్కడా కనిపించలేదు. వేవేకా వీలునామారాశారని వాదించిన అవినాష్ వర్గం ఇప్పుడు ఆ మాట ఎత్తడం లేదు. కడప ప్రకాష్ నగర్ నుండి  వచ్చిన షమీమ్ వివేకా హత్యకు సంబంధించి ఏ విషయాన్నీ తన మూడు పేజీల  స్టేట్ మెంట్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో సహజంగానే అవినాష్ వర్గం నిరుత్సాహానికి గురైంది.

మరో వైపు సుప్రీం కోర్టు తాజా ఆదేశాలు ఆ వర్గాన్ని  మరింత  కలవరపెడుతున్నాయి. షమీమ్ పోరాటానికి, వివేకా హత్య కేసుకు సంబంధం  లేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఏప్రిల్ 25వ తేదీ వరకూఅవినాష్ రెడ్డి అరెస్ట్ పై తెలంగాణ హైకోర్టు స్టే విధించగా,  సుప్రీం కోర్టు అంతకు ఒక రోజు ముందే అంటే 24నే ఈ కేసు విచారిణ చేయనుంది. షేక్ షమీమ్ తన వాటా ఆస్తి కోసం, తన కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం అదే రోజు హైకోర్టు మెట్లు ఎక్కనుంది.

చివరిగా ఒక్క మాట, వైఎస్ రాజశేఖరరెడ్డి తరచుగా తన తమ్ముడు వైఎస్ వివేకానందరెడ్డి గురించి గొప్పగా మాట్లాడేవారు. తండ్రి రాజారెడ్డి తమ్ముడికి వివేకానందుడి పేరు పెట్టడంతో నిజంగా వివేకానందుడి జీవన విధానాన్ని అనుసరిస్తున్నాడని మురిసిపోయేవారు.. కానీ తాజా ఆరోపణలు దివంగత నేత అంచనాలు తప్పని తేల్చేశాయి. 

By
en-us Political News

  
హైదరాబాదు నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనూజ హత్య కేసులో తెలంగాణ స్పెషల్ టీం కీలక పురోగతి సాధించారు.
పండుగకు చెల్లిని ఇంటికి తీసుకెళ్లాలని వచ్చాడు.. కుటుంబమంతా కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవాలని ఆశపడ్డాడు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే బెజవాడ రాజకీయం మరోసారి వేడెక్కింది.
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో దుర్గాపూజ ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
పండుగ వేళ ఆ కళాశాలలో నవ్వులు విరిశాయి.. స్నేహితుల సందడి, దాండియా నృత్యాలతో ప్రాంగణమంతా కోలాహలంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ జిల్లాలో శనివారం అర్ధరాత్రి దాటాక అత్యంత హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది
కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో భక్తుల తాకిడి ఒక్కసారిగా భారీగా పెరిగింది.
బర్త్‌డే నాడే భార్యను చంపి సూసైడ్ చేసుకున్న టెకీ.!
చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దేశీయ ఆహార భద్రతా నియంత్రణ సంస్థ కీలకమైన ముసాయిదా నిబంధనను తెరపైకి తెచ్చింది.
భారతీయ సైన్యంలో అత్యున్నత ప్రమాణాలుగా భావించే క్రమశిక్షణను ఉల్లంఘించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ కనకదుర్గమ్మవారిని ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న దంపతులు దర్శించుకున్నారు
ఢిల్లీలో తీవ్ర సంచలనం సృష్టించిన పరిణామాల మధ్య కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు న్యాయస్థానం ఊరటనిచ్చింది.
ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోలేకపోయాననే అసంతృప్తి.. కొత్తగా తన జీవితంలోకి వచ్చిన భర్తపై ద్వేషంగా మారిందా? కాపురం ప్రారంభమై నెల రోజులు కూడా గడవకముందే ఓ నవవధువు తీసుకున్న నిర్ణయం
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.