వివేకానంద రెడ్డి కన్నీటికి కారణమేంటి?

Publish Date:May 23, 2012

Advertisement

నేను బతికి ఉన్నంతకాలమూ కాంగ్రెస్ వాదిగానే మిగిలిపోతానన్న నాటి మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మాట తప్పారు. ఆయన కూడా ఆ కుటుంబవారసుడనిపించుకున్నారని విమర్శలకు అవకాశమిచ్చారు. ఎన్నికల్లో తన వదినగారు విజయమ్మపై గెలవలేక మంత్రి పదవిని చివరికి అన్నింటినీ వదులుకుని ఒంటరిగా మిగిలిపోయిన వైఎస్ వివేకానందరెడ్డి ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. తమ వారసుడు జగన్ తో కలిసి నడవబోతున్నారు. తన సోదరుడు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆయన కుటుంబానికి దూరమయ్యానని, అయితే దుందుడు స్వభావం ఉన్న ఆయన తన అన్న వైఎస్ ను ఒక్కమాట అన్నందుకే శాసనసభ సాక్షిగా చేయిచేసుకున్నారు. ఇప్పుడు అందరూ రాజశేఖరరెడ్డిని విమర్శిస్తుంటే ఏమీ చేయలేక ఆయన జగన్ పంచన చేరుతున్నారు. చంద్రబాబు అవినీతి పరుడని గొంతెత్తి చాలా గట్టిగా అరిచిన వైఎస్ తన కుమారుడు సహాయంతో అక్రమంగా సంపాదించారన్న విమర్శ తనను ఎక్కువ బాధించిందని వివేకానందరెడ్డి సన్నిహితులతో అన్నారట. కాంగ్రెస్ పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన తన అన్న రాజశేఖరరెడ్డిమరణానంతరం కూడగట్టుకున్న అపప్రద జీర్ణించుకోలేక పోతున్నానని వివేకా కన్నీరుపెట్టుకున్నారట. వదిన చేతిలో ఓటమి పాలైనందువల్లే తాను కాంగ్రెస్ పార్టీకి దూరమయ్యానని గ్రహించిన ఆయన తననూ విమర్శకులు వదలరని ఎప్పుడో గుర్తించారు.

 

 

 

తన అన్న రాజశేఖరరెడ్డిని తిట్టినట్టే తననూ తేడితే మాత్రం తప్పేముందిలే అని ఆయన ఇప్పుడు అన్నింటికీ తెగించారు. దీంతో ఎటువంటి గడ్డుపస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడే జగన్ వెనుక నడుస్తానంటున్నారు. ఏదేమైనా కష్టం వచ్చినప్పుడు నిలబడే వాడే బంధువు అని నిరూపించుకునేందుకు వైఎస్ వివేకా నడుం కట్టారు. అన్ని పార్టీలు తనను కూడా టార్గెట్ చేసినా పర్వాలేదు కానీ, ఒక్క జగన్ తనను నమ్మితే చాలనుకుంటున్నానని వివేకా సన్నిహితుల ముందు ఆవేదన వ్యక్తం చేశారట. అయితే వివేకా పార్టీ మారటం భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందోనని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రి పదవి కోసం జగన్ ను లొంగదీసుకునేందుకూ వెనుకాడని వివేకా గెలిచి ఉంటే తన వైపు వచ్చి ఉండేవాడా అని అని జగన్ సన్నిహితులు అనుమానిస్తున్నారు. ఏమైనా బాబాయిలో వచ్చే మార్పు తమకు అనుకూలంగానే ఉంటుందని జగన్ వారికి సర్దిచేప్పారట. తనకు అందించిన నివేదికల ప్రకారం వివేకానందరెడ్డి తన సాన్నిహిత్యం కోరుకుంటున్నాడని జగన్ గ్రహించినట్టే ఉండి. అందుకే వివేకాకు వ్యతిరేకంగా కానీ, అనుకూలంగా కానీ ఎటువంటి ప్రకటనా చేయలేదు. తన సిబిఐ హడావుడి ముగిసేంత వరకూ బాబాయి సాయం అందిస్తే ఆ తరువాత పార్టీని నడపటం నల్లేరుపై నడకలాంటిదని కూడా జగన్ అనుకుంటున్నారని తెలిసింది. వేరువేరు ఆలోచనలతో కలుస్తున్న ఈ బాబాయ్ - అబ్బాయ్ యవ్వారం ఎలా ఉంటుందో మాత్రం భవిష్యత్తులో తెరపైనే చూడాలని రాష్ట్రమంతా ఆసక్తిగా గమనిస్తోంది.

By
en-us Political News

  
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు మందగించడం, పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేసిన  జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి తీవ్ర నిరవధిక దీక్ష హెచ్చరిక చేశారు.
అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామం వద్ద  ఆ మహిళా ప్రయాణీకురాలు   కండక్టర్‌ను బలంగా తోసివేసింది. ఈ ఊహించని పరిణామానికి కండక్టర్ అదుపుతప్పి నడుస్తున్న బస్సులోంచి రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనలో బస్సు వెనుక చక్రాలు ఆమె  కాళ్లపై నుంచి దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు.  
హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో వేగంగా మార్పులు వస్తున్నాయి.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళ నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది.
రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందస్తు వ్యూహాలకు పదును పెట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.