విజయమ్మపై నోరుపారేసుకుంటున్న కాంగ్రెస్, టిడిపి మహిళానాయకులు
Publish Date:May 30, 2012
Advertisement
జగన్ జ్యూడిషియల్ కస్టడీలో ఉండటంతో ఆయన తల్లి విజయమ్మ ప్రజల వద్దకు నేరుగా వెళ్ళారు. తన భర్త రాజశేఖరరెడ్డి మరణంపై తనకు అనేక అనుమానాలున్నాయని, అమాయకుడైన జగన్ ను కాంగ్రెస్, టిడిపిలు వేదిస్తున్నాయని ప్రచారం చేస్తూ ప్రజల సానుభూతిని పొందటానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా విజయమ్మను తమ పార్టీల్లో నోరున్న మహిళా నాయకులతో ఎదుర్కోవాలని కాంగ్రెస్, టిడిపిలు నిర్ణయించాయి. పార్టీ ఆదేశాలు అందిన వెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపి రేణుకాచౌదరి, గంగాభవానీ, తెలుగుదేశం పార్టీకి చెందిన పరిటాల సునీత, సినీనటి కవిత తదితరులు రంగంలోకి దిగి విజయమ్మపై విమర్శనాస్త్రాలను సంధించటం ప్రారంభించారు. విజయమ్మ పుత్రవాత్సల్యంతో గాంధారిలా వ్యవహరిస్తూ దుర్యోధనుడు లాంటి జగన్ ను వెనుకేసుకువస్తున్నారని విమర్శిస్తున్నారు. పరిటాల హత్య కేసులో జగన్ ప్రమేయంపై అతనికి సిబిఐ గతంలో క్లీన్ చిట్ ఇచ్చిన ఆనందంతో ఆమె సి.బి.ఐ.ని పొగిడారని అదే సి.బి.ఐ.ని ఆమె విమర్శించడంలో అర్థం లేదని వారు అంటున్నారు. తన కుటుంబ బాధను ప్రజల బాధగా భావించి సానుభూతి కోసం విజయమ్మ డ్రామాలు ఆడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, టిడిపీల మహిళానాయకురాళ్ల దాడి నుంచి విజయమ్మను కాపాడేందుకు మహిళానాయకురాలు వాసిరెడ్డి పద్మ ఇప్పటికే రంగంలోకి దిగారు.
http://www.teluguone.com/news/content/ys-vijayamma-24-14482.html





