తెలుగుదేశం గూటికి వైఎస్ సునీత: కడప జడ్పీ చైర్ పర్సన్ ఆఫర్.. లోకేష్ వ్యూహమేంటి?

Publish Date:Sep 23, 2026

Advertisement

దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత తెలుగుదేశం గూటికి చేరనున్నారా? జగన్ కు పెట్టని కోట లాంటి కడపలో వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి నారా లోకేష్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే.. వైఎస్ కుటుంబానికి చెందిన వైఎస్ సునీతను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి.. స్థానిక సంస్థల ఎన్నికల బరిలోకి దింపేందుకు  నిర్ణయించుకున్నారా? ఈ మేరకు లోకేష్ చేసిన ప్రతిపాదనకు వైఎస్ సునీత ఓకే చెప్పారా? ఈ ప్రశ్నలకు పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఔనన్న సమాధానమే వస్తోంది.  

 మంత్రి నారా లోకేష్  స్వయంగా ఈ  ప్రతిపాదనను తెరపైకి తెచ్చినట్లు తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల పరిధిలోని లింగాల మండలం నుంచి  జెడ్పీటీసీ స్థానానికి పోటీ చేయాల్సిందిగా  వైఎస్ సునీతను లోకేష్ కోరినట్లు  ప్రచారం జరుగుతోంది. కేవలం పోటీ చేయడమే కాకుండా, ఆ ఎన్నికలో విజయం సాధిస్తే..  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పదవి  కట్టబెడతామని స్పష్టమైన హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.  వైఎస్ కుటుంబానికి, వైసీపీకి తిరుగులేని పట్టు,  బలం,  ప్రాబల్యం ఉన్న ప్రాంతంలోనే ఆ పార్టీని గట్టి దెబ్బకొట్టాలన్న వ్యూహంతోనే లోకేష్ ఈ ప్రతిపాదన చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాష్ట్రంలో స్థానిక ఎన్నికల వేడి పీక్స్ చేరుతున్న తరుణంలో లోకేష్ చేసినట్లుగా చెబుతున్న ఈ ప్రతిపాదనకు  రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. అధికారికంగా ఈ ప్రతిపాదనకు సంబంధించిన సమాచారం ఏదీ బయటకు రాకపోయినా.. పొలిటికల్ సర్కిల్స్ లో మాత్రం వైఎస్ సునీత సైకిలెక్కి జగన్ కు సవాల్ విసరడం దాదాపు ఖాయమైందనే అంటున్నారు. 

వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఉదంతం తర్వాత వైఎస్ సునీత న్యాయం కోసం పోరాటం చేసిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణానికి కారణమైన వారిపై రాజకీయంగా, న్యాయపరంగా ఆమె చేసిన పోరాటం ప్రజల్లోకి బలంగా వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమెకు రాజకీయ ఆశ్రయం కల్పించడం ద్వారా ప్రత్యర్థి పార్టీని ఇరుకున పెట్టవచ్చని నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ  భావిస్తున్నాయి. 

మరోవైపు, వైఎస్ కుటుంబానికి కంచుకోటగా భావించే పులివెందుల ప్రాంతంలో ఇలాంటి పరిణామాలు జరిగితే స్థానిక రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. సొంత కుటుంబ సభ్యురాలే ప్రత్యర్థి పార్టీ మద్దతుతో బరిలోకి దిగితే అది రాజకీయంగా జగన్ కు పెద్ద ఎదురుదెబ్బ అవుతుందంటున్నారు. ఏది ఏమైనా సునీత తెలుగుదేశం గూటికి చేరతారా అన్న విషయం ఆమె నుంచి అధికారికంగా ప్రకటన వచ్చే వరకూ ఖరారైనట్లు కాదని పరిశీలకులు అంటున్నారు. 

[YS Sunitha, Nara Lokesh, Lingala ZPTC, Kadapa politics, TDP offer, Telugu Desham Party, Kadapa, ZP Chair Person, AP Politics, Telugu One]

By
en-us Political News

  
భారతీయ చలనచిత్ర పరిశ్రమ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం గుజరాత్‌లోని ఏక్తా నగర్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
యువనేత లోకేష్ రాప్తాడు రావడం పార్టీ కేడర్‌కు పండుగ రోజు.
తన కుమార్తె వివాహాన్ని అడ్డుపెట్టుకుని జగన్ తో సయోధ్య కోసం తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారంటూ తనపై వచ్చిన ఆరోపణలను ఆమె నిర్ద్వంద్వంగా ఖండించారు.  
సినిమా రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రముఖ సినీనటి రాధ తన కుటుంబ సభ్యులపై చెన్నై పోలీసులను ఆశ్రయించారు.
రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి తీవ్రమైన అభియోగాలపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోలీసుల విచారణలో భాగంగా వెలుగుచూసిన పరిణామాలు, అతడు వ్యక్తం చేసిన పశ్చాత్తాపం డిజిటల్ మీడియాలో ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసే వారందరికీ నిస్సందేహంగా ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు. 
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
పెళ్లంటే సంబరమా.. అప్పుల భారమా? రూ.45 లక్షల లోన్‌పై నెటిజన్ ఆవేదన..!
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.