లోక్‌సభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ.. కొన్ని సార్లు వేగంగా.. మరికొన్ని సార్లు నెమ్మదిగా సాగుతోంది. దీంతో అసలు ఈ కేసు విచారణ ఎంత వరకు వచ్చిందంటే... సీబీఐ అధికారులే ఈ కేసుపై క్లియర్ కట్‌గా ఓ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారనే ఓ టాక్ అయితే ఉమ్మడి కడప జిల్లాలో జోరుగా నడుస్తోంది. అయితే ఈ కేసులో దోషులు బయటపడతారని వివేకా కుమార్తె సునీత కళ్లల్లో ఒత్తులు వేసుకునీ మరీ ఎదురు చూస్తున్నారు. కానీ ఈ కేసు విచారణ మాత్రం నత్తతో పోటీపడి నడుస్తోంది. మరోవైపు వివేకా హత్య కేసులో సీఎం జగన్‌తోపాటు కడప ఎంపీ ఆవినాష్ రెడ్డి హస్తం ఉందని విపక్ష టీడీపీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా వివేకా హత్య అనంతరం పులివెందుల్లో వైయస్ ఫ్యామిలీలోని వారే వర్గాలుగా విడిపోయారని పులివెందులలో జనం చర్చించుకుంటున్నారు. దీంతో గతంలో కడప జిల్లా అనగానే వైయస్ ఫ్యామిలీ గుర్తుకు వచ్చేదని.. నేడు ఆ పరిస్థితి లేదన్న భావన ఆ జిల్లా వాసులలో వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చేది ఎన్నికల సీజన్.. అలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం టీడీపీ చేస్తున్న ఆరోపణల్లో.... బాబాయ్ గొడ్డలి పోటును.. తమకు అనుకూలంగా మలుచుకునేందుకు సీఎం జగన్ పావులు కదుపుతున్నారని వైసీపీ శ్రేణుులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం సైకిల్ పార్టీకి స్పీడుకు న్ బ్రేకులు వేసేందుకు.. వచ్చే ఎన్నికల్లో పులివెందుల నుంచి వివేకా కుమార్తె సునీతను వైసీపీ అభ్యర్థిగారంగంలోని దింపాలని సీఎం జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
1978 నుంచి పులివెందుల నియోజకవర్గం వైయస్ ఫ్యామిలీకి కంచుకోట అన్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్, ఆయన తరువాత వైయస్ విజయమ్మ, ఇప్పుడు ఆయన కుమారుడు జగన్ ఇక్కడి నుంచి గెలిచి.. అసెంబ్లీలో అడుగు పెట్టిన విషయం విదితమే. అయితే ఈ నియోజకవర్గాన్ని సునీతకు కట్టబెట్టి.. ఇదే జిల్లాలోని జమ్మలమడుగు నుంచి జగన్ రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకొంటున్నారని వైసీపీ వర్గాల సమాచారం.
సదరు నియోజకవర్గం కూడా వైయస్ ఫ్యామిలీకి కంచుకోటే. ఆ నియోజకవర్గంలో కూడా వైయస్ ఫ్యామిలీకి భారీగా అభిమానులున్నారు. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ నేతలు చాలా బలంగా ఉన్నా.. ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా సుధీర్ రెడ్డి విజయకేతనం ఎగురవేశారు. అదీకాక.. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి.. తొలినాళ్లలో ఇదే నియోజకవర్గంలో వైద్యునిగా పని చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సంగతి తెలిసిందే.
మరి వైయస్ జగన్ చేస్తున్న రాజకీయంలో వైయస్ వివేకా కుమార్తె సునీత చిక్కుతారో లేక తన తండ్రి హత్యకు కారకులైన వారిని న్యాయదేవత సాక్షిగా న్యాయస్థానంలో నిలబెట్టి.. వారికి కఠిన శిక్ష పడేలా చేసి.. తన తండ్రి ఆత్మకు శాంతి చేకూర్చేలా ఆమె.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తారా? అని కడప జిల్లా జిల్లా ప్రజలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/ys-sunita-as-ycp-candidate-from-pulivendula-jagan-sketch-39-139120.html
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.